For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాస్తా డే స్పెషల్ రిసిపి - కోల్డ్ పాస్తా సలాడ్

|

ప్రపంచ ‘పాస్తా' రోజును ప్రతి సంవత్సరం అక్టోబర్ 25న జరుపుకొంటారు. ఈ రోజు చాలా దేశాల్లో ఈ పాస్తా డే ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని ఇటాలియన్ రుచులను ఆరగిస్తారు. పాస్తాలో ఉన్న న్యూట్రిషయన్స్ చాలా అరోగ్యకరం కాబట్టి ఈ ఇటాలియన్ ఫుడ్ ను ఇతర దేశాల్లో అందురూ చాలా అమితంగా ఇష్టపడుతారు. ఈ ఇటాలియన్ డిషెస్ చాలా ప్రసిద్ది చెందినవి. రాను రాను మన దేశంలోని ప్రజలు కూడా ఈ ఇటాలియన్ రుచులకు అలవాటు పడుతున్నారు.

Pasta

రోజు బీరకాయ, పప్పు, క్యాబేజీ, సొరకాయ, వగైరా వగైరా కూరల వండి విసుగు వచ్చేసింది.. తినిని బోరుకొడుతుంటే కనుక ఈ వెరైటీ పాస్తా తయారు చేసి తింటే చాలా రుచికగా వుంటుంది. ప్రాసెస్ కొంచం చిన్నదే అయినా నూడిల్స్ తో పోలుచుకుంటే కొంచం టైం ఎక్కువ పడుతుంది.. కాకపోతే నూడిల్స్ తో పోలిస్తే రుచి బావుంటుంది, ఆరోగ్యకరం కూడా. పాస్తా ఇప్పుడు అన్ని షాప్స్ లో దొరుకుతున్నాయి.. రెడీమేడ్ గా వస్తున్న పాస్తా కంటే విడిగా వున్నా గోధుమ, రైస్ తో చేసిన పాస్తానే తీసుకోండి. మైదాతో చేసిన దానిని తీసుకోవద్దు. మరీ పాస్తా వంటకాల్లో చాలా రకాలే ఉన్నాయి. అయితే వాటిలో చాలా సులభంగా వండే కోల్డ్ పాస్తా సలాడ్ మీకోసం...

కావలసిన పదార్థాలు:
పాస్తా: 250grms
కీరదోసకాయ: 1
ఉల్లిపాయ(చిన్నది): 1
చెర్రీ టొమాటోలు: 10(లేదా మనం సాదారణంగా ఉపయోగించే మామూలు టమోటోలు-3)
బ్లాక్ ఆలివ్స్ (కట్ చేసినవి): 1/2cup
ఆలివ్‌ ఆయిల్: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: 1tsp
వెనిగర్: 1tsp
సలాడ్ డ్రెస్సింగ్(మార్కెట్‌లో లభిస్తుంది): 2tbsp
ఇటాలియన్ హెర్బ్: 1tsp(వేయించాలి)

తయారు చేయు విధానం:
1. ముందుగా పెద్ద గిన్నెలో కొన్ని నీళ్లు పోసి, మరిగించి, కొద్దిగా ఉప్పు కలపాలి.
2. తర్వాత దాంట్లో పాస్తా వేసి, ఉడికించి, జల్లిలో పోసి, వడకట్టాలి. తర్వాత పై నుంచి చల్లని నీరు పోయాలి. దీని వల్ల పాస్తా ఒకదానికొకటి అతుక్కోవు.
3. అంతలోపు కీరాపై పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టొమాటోలు, బ్లాక్ ఆలివ్స్ కట్ చేసి వెడల్పాటి గిన్నెలో వేయాలి. (బ్లాక్ ఆలివ్స్ కు బదులు ఎల్లో, రెడ్, గ్రీన్ క్యాప్సికమ్ ఉపయోగించవచ్చు)
4. తర్వాత ఉడికించిన పాస్తా, ఆలివ్ ఆయిల్, వెనిగర్, మిరియాలపొడి, సలాడ్ డ్రెస్సింగ్ వేసి బాగా మిక్స్ చేయాలి.
5. చివరగా ఇటాలియన్ హెర్బ్‌ని పైన చల్లి, ఫ్రిజ్‌లో పెట్టాలి. రెండు గంటల తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేయాలి. అంతే కోల్డ్ పాస్తా సలాడ్ రెడీ...

English summary

World Pasta Day: Cold Pasta Salad | కోల్డ్ పాస్తా సలాడ్..

World Pasta Day is celebrated on 25th of October every year. This day is celebrated in many countries to highlight the special Italian dish. It is a day when the nutritional and culinary aspects of pasta is widespread.
Story first published: Thursday, October 25, 2012, 16:54 [IST]
Desktop Bottom Promotion