For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ అండ్ యమ్నీ పన్నీర్ చీజ్ బాల్స్

|

పనీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మన ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా అందిస్తుంది. దీన్ని డైరీ ప్రొడక్ట్స్ తో తయారుచేస్తారు. అయినా కూడా ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.

పనీర్ లో క్యాల్షియం, ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. ఇవి బరువు తగ్గించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతాయి . ఇది బోన్ స్ట్రెంగ్త్ ను పెంచుతుంది, ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్సున్న ఈ పనీర్ కు మరో హెల్తీ చీజ్ జోడించి, రెండింటి కాంబినేషన్ లో ఒక హెల్తీ స్నాక్ తయారుచేసుకుంటే టేస్ట్ కు టేస్ట్ మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం పొందవచ్చు . మరి హెల్తీ అండ్ టేస్టీ పనీర్ చీజ్ రోల్స్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Yummy Paneer Cheese Balls Recipe

కావల్సిన పదార్థాలు:

  • పనీర్ - 500 g (grated)
  • చీజ్ - 1 cup (grated)
  • ఉల్లిపాయలు - 1 cup
  • పచ్చిమిర్చి - 4 to 5
  • బ్రెడ్ పొడి - 1/2 cup
  • బంగాళదుంపలు - 1/2 cup
  • కార్న్ ఫ్లోర్ - 1/2 cup
  • కారం - 1/2 teaspoon
  • ఉప్పు: రుచికి సరిపడా
  • నూనె తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పనీర్ తురుము మరియు చీజ్ తురుము వేయాలి.
2. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, బంగాళదుంప, కారం వేసి బాగా మిక్స్ చేయాలి.
3. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి .
4. తర్వాత ఈ మిశ్రమం నుండి కొద్దిగా కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని ప్లేట్ పెట్టుకోవాలి.
5. ఇలా అన్నింటిని తయారుచేసుకొన్న తర్వాత , స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చయాలి.
6. నూనె వేడి అయ్యాక పనీర్ చీజ్ బాల్స్ బ్రెడ్ పొడిలో పొర్లించి తర్వాత కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.
7. డీప్ ఫ్రై చేసుకొన్న తర్వాత వీటిని ప్లేట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి, . అంతే హాట్ హాట్ పనీర్ బాల్స్ రెడీ, వీటిని టమోటో సాస్ తో సర్వ్ చేయండి..

English summary

Yummy Paneer Cheese Balls Recipe

Today, we shall share a paneer and cheese recipe that can be served as a starter or you can serve it as an evening snack as well. Yes, dear readers, we've shared the easy Paneer Cheese Balls recipe that you can savour. So, take a look at how to prepare the yummy paneer cheese balls recipe for the ingredients required and the method of preparation.
Story first published:Friday, May 20, 2016, 18:27 [IST]
Desktop Bottom Promotion