Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయాన్నే ఇలా టేస్టీ,సూపర్ క్రిస్పీ దోసె..ఎలా చేసుకోవాలంటే..
రాత్రి వండిన అన్నం మిగిలిపోయిందా? ఉదయం లేవగానే దాన్ని ఏం చేయాలో అర్థం కాక పారేస్తున్నారా? లేక అదే చల్లటి అన్నం తినలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మిగిలిపోయిన అన్నంతో కేవలం 10 నిమిషాల్లో కరకరలాడే క్రిస్పీ దోసె తయారుచేసుకోవచ్చు.
దీనివల్ల అన్నం వృధా కాదు, పైగా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ చిటికెలో రెడీ అయిపోతుంది. దీని కోసం ఎలాంటి పప్పులు నానబెట్టే పని ఉండదు, పిండి పులియబెట్టే అవసరం లేదు.

కావలసిన పదార్థాలు
-మిగిలిపోయిన అన్నం - 2 కప్పులు
-బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) - అర కప్పు
-పెరుగు- అర కప్పు
-ఉప్పు - తగినంత
-నీళ్లు - సరిపడా
-నూనె లేదా నెయ్యి - దోసె కాల్చుకోవడానికి
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పుల మిగిలిన అన్నం, అరకప్పు బొంబాయి రవ్వ వేయండి. రవ్వ వేయడం వల్లే దోసెకు హోటల్ స్టైల్ లో లాగా మంచి క్రిస్పీనెస్ వస్తుంది.
-ఇప్పుడు ఆ మిశ్రమంలో అర కప్పు పెరుగు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నం పలుకులు ఎక్కడా తగలకుండా, సాధారణ దోసె పిండిలా సాఫ్ట్ గా ఉండేలా రుబ్బుకోవాలి.
-రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోండి. రవ్వ నీటిని పీల్చుకుంటుంది కాబట్టి ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోసెల పెనం పెట్టుకోండి. పెనం బాగా వేడయ్యాక కొద్దిగా నీళ్లు చల్లి క్లాత్ తో తుడవండి. ఆ తర్వాత గరిటెతో పిండిని తీసుకుని పెనం మధ్యలో వేసి గుండ్రంగా, పల్చగా పరుచుకోండి.
-దోసె అంచుల వెంబడి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయండి. మీడియం మంటపై దోసె ఎర్రగా, కరకరలాడేలా కాలే వరకు ఉంచండి. ఈ దోసె చాలా పల్చగా ఉంటుంది కాబట్టి రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు. అంతే, వేడివేడి క్రిస్పీ దోసె రెడీ.
-ఈ ఇన్ స్టంట్ రైస్ దోసెకు పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ అద్భుతమైన కాంబినేషన్. కొద్దిగా స్పైసీగా, పుల్లగా కావాలనుకునే వారు టమాటో చట్నీతో ట్రై చేయవచ్చు. వేడి వేడి సాంబార్ లేదా ఏదైనా వెజ్, నాన్ వెజ్ గ్రేవీతో తిన్నా దీని రుచి అదుర్స్ అనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications