Latest Updates
-
కొత్త డేటింగ్ ట్రెండ్ టోలియమోరీ..ఆధునిక బంధాల్లో కొత్త విషం! -
వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోండి -
CBSE ఫలితాల వేళ భయపడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
సెమాగ్లుటైడ్ వాడుతున్నారా? బరువు తగ్గే క్రమంలో ఈ ప్రమాదాలు తెలుసా! -
మేష సంక్రాంతి 2026: ఈ పండుగలు మీ జీవితాన్ని మారుస్తాయా? -
కృష్ణ జన్మాష్టమి పూజలో ఈ తప్పులు చేస్తున్నారా? ఫలితం దక్కాలంటే ఇలా చేయండి -
మనం తినే ఆహారంలో దాగిన 5 మహా దోషాలు.. ఇవి తెలుసుకోకుంటే ఎన్నో అనర్థాలు! -
బరువు పెరుగుతామనే భయం వద్దు.. ఈ సమ్మర్ కి షుగర్ ఫ్రీ కర్బూజా కుల్ఫీ ట్రై చేయండి! -
నానబెట్టిన వాల్ నట్స్..15 రోజులు తింటే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
తొక్కే కదా అని తీసిపారేయకండి..అందులోనే దాగుంది అసలైన రుచి..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే పుచ్చకాయ తొక్క చట్నీ
హోటల్ స్టైల్ పనీర్ పరాఠా ఇంట్లోనే..ఈ సీక్రెట్ టిప్స్ మీకోసమే!
ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యకరంగా, రుచికరంగా ఉండటం చాలా అవసరం. మీ రోజును ఉత్సాహంగా, శక్తివంతంగా ప్రారంభించాలనుకుంటే ప్రోటీన్ పుష్కలంగా ఉండే పనీర్ పరాఠాను మీ డైట్ లో తప్పకుండా చేర్చుకోండి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, నోటికి ఎంతో రుచిగా ఉంటుంది.
అయితే పనీర్ పరాఠా చేసేటప్పుడు చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య... లోపల పెట్టిన స్టఫింగ్ (మిశ్రమం) బయటకు వచ్చేయడం, పరాఠాలు విరిగిపోవడం. అయితే పరాఠాలు ఏమాత్రం విరిగిపోకుండా, హోటల్ స్టైల్ లో పర్ఫెక్ట్ గా, మృదువుగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
పనీర్ పరాఠా తయారీకి కావలసిన పదార్థాలు
గోధుమ పిండి - 2 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి లేదా నూనె - 2 టీస్పూన్లు
పనీర్ - 250 గ్రాములు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 3
అల్లం ముక్క - చిన్నది
కొత్తిమీర - కొద్దిగా
కారం - అర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఆమ్చూర్ (మామిడి)పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
వాము - అర టీస్పూన్
పనీర్ పరాఠా తయారీ విధానం
-పర్ఫెక్ట్ పరాఠా రావాలంటే పిండి కలపడంలోనే అసలు కిటుకు ఉంది. ఒక వెడల్పాటి గిన్నెలో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు, రెండు టీస్పూన్ల నెయ్యి వేసి బాగా కలపండి. నెయ్యి వేయడం వల్ల పరాఠాలు లోపల మృదువుగా, బయట కరకరలాడుతూ వస్తాయి.
-ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిని మరీ గట్టిగా కాకుండా, కాస్త మెత్తగా కలుపుకోండి. పిండిని గట్టిగా కలిపితేనే పరాఠా ఒత్తేటప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. కలుపుకున్న పిండిపై కొద్దిగా నూనె రాసి, గాలి చొరబడకుండా మూతపెట్టి కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు పనీర్ స్టఫింగ్ సిద్ధం చేసుకోండి. 250 గ్రాముల పనీర్ ను తీసుకుని మెత్తగా తురుముకోండి లేదా చేత్తో స్మాష్ చేయండి. ఈ పనీర్ తురుములో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర వేయండి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, చేతితో కొద్దిగా నలిపిన వాము, చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి.
-నానబెట్టుకున్న పిండి నుండి ఒక పెద్ద నిమ్మకాయ సైజులో ముద్దను తీసుకోండి. దానికి పొడి పిండి అద్ది, బొటనవేళ్ల సహాయంతో చిన్న గిన్నె (కప్) ఆకారంలోకి వత్తండి. ఇలా చేయడం వల్ల మిశ్రమం నింపడం సులువు అవుతుంది.
-ఇప్పుడు తయారుచేసి పెట్టుకున్న పనీర్ ఉండను ఆ పిండి గిన్నెలో ఉంచి, స్టఫింగ్ ను లోపలికి నొక్కుతూ పిండి అంచులను పైకి తీసుకువచ్చి గట్టిగా మూసివేయండి. ఎక్కడా గ్యాప్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ ముద్దను చేతితో మెల్లగా అదిమి, పొడి పిండి చల్లుతూ చపాతీ కర్రతో చాలా సున్నితంగా వత్తండి. మరీ గట్టిగా ఒత్తితే పనీర్ బయటకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి తేలికగా రోల్ చేయాలి.
-స్టవ్ వెలిగించి మందపాటి పెనం పెట్టి వేడి చేయండి. దానిపై కొద్దిగా నెయ్యి రాయండి. ఇప్పుడు వత్తి పెట్టుకున్న పరాఠాను పెనంపై వేసి మీడియం మంట మీద రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి.
-అంతే వేడి వేడి పనీర్ పరాఠాలు రెడీ. వీటిని చల్లటి పెరుగుతో గానీ, మీకు ఇష్టమైన పచ్చడితో తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








