Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మినపప్పు అక్కర్లేదు..బొరుగులతో అప్పటికప్పుడు గారెలు..పైన క్రంచీగా,లోపల మెత్తగా భలే రుచి
గారెలు చేయాలంటే మినపప్పు నానబెట్టడం తర్వాత వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయడం కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అయితే మినపప్పు నానబెట్టే పనిలేకుండా మరమరాలతో అప్పటికప్పుడు గారెలు తయారు చేసుకోవచ్చు. మరమరాలను ఉపయోగించి తయారుచేసే అనేక వంటకాల్లో మరమరాల గారెలు ఒక ప్రత్యేకమైన, రుచికరమైన, తక్కువ సమయంలో తయారుచేయగలిగే అల్పాహారం. మరమరాలను బొరుగులు అని కూడా పిలుస్తారు. మరమరాల గారెలు మినపప్పు గారెలంత బరువుగా, జిడ్డుగా ఉండకుండా లోపల మెత్తగా, పైన కొద్దిగా కరకరలాడుతూ, ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఉంటాయి. మరమరాల గారెలను అప్పటికప్పుడు టేస్టీగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-మరమరాలు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-అల్లం
-కరివేపాకు
-కొత్తిమీర
-పెరుగు
-ఉప్మా రవ్వ
-ఆయిల్
-ఉప్పు
-వంట సోడా
-జీలకర్ర

తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో 3 కప్పుల మరమరాలు వేయండి.
-మరమరాలతో ఒక బాటిల్ నీళ్లు పోసి 2 నిమిషాలు నాననివ్వాలి.
-మరమరాలు నానిన తర్వాత నీటిలో నుంచి మరమరాలను పిండేసి ఓ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ(ఉప్మా రవ్వ) వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని ఓ గిన్నెలోకి పిండిని తీసి పెట్టుకోండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో మరమరాలను వేసి,ఇందులోనే అరకప్పు పెరుగు, 1కప్పు నీళ్లు కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి కొంచెం పలుకు పలుకుగా ఉంటే సరిపోతుంది.
-ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని గ్రైండ్ చేసిన రవ్వలో వేసి బాగా చేత్తో కలపాలి. రవ్వ మొత్తం పిండిలో బాగా కలిసిన తర్వాత గిన్నె మీద మూత పెట్టేసి పావు గంట సేపు వదిలేయండి.
-తర్వాత మూత తీసి అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు, 1స్పూన్ జీలకర్ర వేసి అవన్నీ పిండిలో కలిసేంతవరకు కలుపుకోవాలి. గారెల పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీలో ఆయిల్ పోసి వేడి చేశాక పిండిని గారెల్లా వత్తుకొని వాటిని బాండీలోని ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. గారెలను ఫ్రై చేసే సమయంలో మంటను మీడియంలో ఉంచుకోండి.
-గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక వాటిని ఆయిల్ నుంచి తీయండి. అంతే టేస్టీ మరమరాల గారెలు రెడీ. వీటిని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications