Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
నోట్లో ఇట్టే కరిగిపోయే ద్రాక్ష హల్వా.. రుచి చూస్తే వదిలిపెట్టరు..ఎలా చేసుకోవాలంటే..
స్వీట్లు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? భోజనం తర్వాత కాస్త తీపి తినాలనిపించినా లేదా సాయంత్రం వేళ ఏదైనా కొత్తగా స్నాక్స్ తినాలనిపించినా మన మనసు ముందుగా లాగేది స్వీట్ల వైపే. సాధారణంగా మనం ఇంట్లో రవ్వ హల్వా, క్యారెట్ హల్వా లేదా బ్రెడ్ హల్వా వంటివి తరచుగా చేసుకుంటూ ఉంటాం.
కానీ ఎప్పుడైనా పండ్లతో హల్వా ప్రయత్నించారా? ముఖ్యంగా సీజనల్ గా దొరికే ద్రాక్ష పండ్లతో చేసే హల్వా రుచి అమోఘంగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉండే ద్రాక్ష హల్వాను.. బాంబే హల్వా లేదా కరాచీ హల్వా తరహాలో జెల్లీలా మృదువుగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ద్రాక్ష హల్వాను ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
తీపి ద్రాక్ష పండ్లు (నల్లవి లేదా ఆకుపచ్చవి) - అర కిలో
మొక్కజొన్న పిండి- ముప్పావు కప్పు
చక్కెర - అర కప్పు
నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు
నీళ్లు - తగినన్ని
ఆకుపచ్చ ఫుడ్ కలర్ - చిటికెడు
డ్రై ఫ్రూట్స్- జీడిపప్పు, బాదం, పిస్తా
తయారీ విధానం
-ముందుగా పులుపు లేని తీపి ద్రాక్ష పండ్లను ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ద్రాక్ష పండ్లను, అర కప్పు నీళ్లను పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి, పిప్పి తీసేసి కేవలం ద్రాక్ష రసాన్ని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక పాన్ లేదా కడాయిలో సిద్ధం చేసుకున్న ద్రాక్ష రసం (సుమారు 2 కప్పులు ఉండాలి), దానికి అదనంగా ఒక కప్పు నీళ్లు, అర కప్పు పంచదార, ముప్పావు కప్పు మొక్కజొన్న పిండి వేయాలి. ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా కలపాలి.
-ఇప్పుడు ఈ పాన్ ను స్టవ్ మీద పెట్టి మంటను చిన్నగా ఉంచాలి. గరిటతో ఆపకుండా కలుపుతూనే ఉండాలి. సుమారు 5 నిమిషాల్లో మిశ్రమం చిక్కబడి, దగ్గరగా అవ్వడం గమనించవచ్చు.
-మిశ్రమం చిక్కబడి జెల్లీలా మారుతున్నప్పుడు అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి కలపాలి. హల్వా పారదర్శకంగా మారుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు, చిటికెడు ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి.
-మధ్యమధ్యలో ఒక్కో స్పూన్ నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. హల్వా పాన్ కు అతుక్కోకుండా నెయ్యిని వదులుతూ, ముద్దలాగా వేరుపడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
-ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ఒక ప్లేట్ లేదా ట్రేలోకి ఈ హల్వా మిశ్రమాన్ని పోసి సమంగా పరచాలి. దీనిని కనీసం 2 గంటల పాటు చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో మీకు నచ్చిన షేప్ లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, జ్యూసీగా ఉండే ద్రాక్ష హల్వా రెడీ. ఇది ఫ్రిజ్ లో పెడితే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







