Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
అమృత్ సర్ స్టైల్ ఆలూ కుల్చా..వెదర్ కూల్ గా ఉన్న టైంలో తింటుంటే అమేజింగ్..ఈజీగా చేసుకోండిలా..
పంజాబ్ రాజధాని అమృత్ సర్ స్వర్ణదేవాలయానికే కాకుండా వంటలకు కూడా చాలా ఫేమస్. ముఖ్యంగా అమృత్ సరి కుల్చా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ది చెందింది. అమృత్ సరి ఆలూ కుల్చాని తందూర్(మట్టి పొయ్యి) లో కాలుస్తారు. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా, పొరలు పొరలుగా ఉండే ఈ కుల్చా రుచిని మాటల్లో వర్ణించడం కష్టం.
అయితే ఈ అద్భుతమైన రుచిని టేస్ట్ చెయ్యడానికి మనం అమృత్ సర్ దాకా వెళ్లక్కర్లేదు. మన ఇంట్లోని పెనంపైనే అదే టేస్ట్ ని సాధించవచ్చు. అమృత్ సర్ స్టైల్ ఆలూ కుల్చా మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-బంగాళదుంపలు
-మైదా పిండి
-ఉప్పు
-చక్కెర
-చిలికిన పెరుగు
-పాలు
-బేకింగ్ సోడా
-బటర్
-పన్నీర్
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-అల్లం
-కొత్తిమీర
-వేయించిన ధనియాల పొడి
-వేయించిన జీలకర్ర పొడి
-గరం మసాలా
-చాట్ మసాలా

తయారీ విధానం
ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోయండి. ఇందులోనే ఒక చిన్న గిన్నె పెట్టి అందులో 2 బంగాళదుంపలు వేసి కుక్కర్ మూతపెట్టి మీడియం మంట మీద 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి స్టవ్ ఆపేయాలి.
ఇప్పుడు కుల్చా పిండి కలుపుకోవాలి. ఇందుకోసం పావు కేజీ మైదా పిండి తీసుకొని పిండి మధ్యలో గుంటలా చేసి ఇందులో పావు టీస్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు, చిటికెడు చక్కెర, పావు కప్పు చిలికిన పెరుగు వేసి దీనిని బాగా కలిపితే పెరుగు పొంగుతుంది. ఇప్పుడు ఈ పెరుగులో పావు కప్పు పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మైదాపిండిని లోపలికి లాక్కుంటూ కలుపుకోండి. దీంతో పిండి గడ్డలు లేకుండా మృదువుగా వస్తుంది.
ఇప్పుడు మరో పావు కప్పు నీళ్లను కొంచెం కొంచెంగా పోస్తూ పిండిని దగ్గరకు లాక్కుంటూ కలుపుకోవాలి.
పిండిని అరచేతి మణికట్టుతో గట్టిగా అదిమిపట్టి 4 నిమిషాల పాటు ముందుకు వెనుకకు గట్టిగా చాదాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి మణికట్టుతో ఇలానే 5 నిమిషాలు వత్తుకుంటే పిండి మృదువుగా చేతికి అంటకుండా ఉంటుంది.
కలిపిన పిండిని నాలుగు ముద్దలుగా చేసి ఓ బౌల్ లో వేసి తడిగుడ్డ కప్పి అరగంట సేపు పక్కన పెట్టేయండి.
-ఇప్పుడు స్టఫింగ్ తయారీ కోసం..చల్లారిన ఉడికించిన బంగాళదుంపలను తురుముకోవాలి. ఇందులోనే 50 గ్రాముల పన్నీర్ తురుము, 1 పచ్చిమిర్చి సన్నని తరుగు, కొత్తిమీర తరుగు కొంచెం, 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు, 1 టీస్పూన్ అల్లం తురుము, 1 టీస్పూన్ చాట్ మసాలా, పావు టీస్పూన్ వేపిన ధనియాల పొడి, పావు టీస్పూన్ వేపిన జీలకర్ర పొడి, పావు టీస్పూన్ గరం మసాలా, కొంచెం ఉప్పు కూడా వేసి మొత్తం బాగా కలిసేలా చేత్తో కలుపుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో అరకప్పు నీళ్లు(70ml), 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు తడిగుడ్డ కింద అరగంటసేపు నానబెట్టిన పిండి ముద్దను అర చేతుల్లోకి తీసుకొని మధ్యన మందంగా,అంచులు పల్చగా ఉండేలాగా అరచేతి వెడల్పున స్ప్రెడ్ చేయండి,ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల బంగాళదుంప స్టఫింగ్ ని మధ్యలో పెట్టి అంచుల వెంట ఉన్న పిండిని లోపలికి లాక్కుంటూ మడతేయాలి. అంచులన్నీ గట్టిగా బిగించి సీల్ చేసేయాలి.
-ఇప్పుడు కుల్చా వత్తుకునే చోట పొడి పిండి చల్లుకొని దీనిమీద స్టఫింగ్ పెట్టి సీల్ చేసిన పిండి ముద్దను పెట్టి వేళ్లతో నెమ్మదిగా వత్తుకోవాలి. దీంతో పిండిలోని గాలి బయటకు వచ్చేస్తుంది. లోపలి స్టఫింగ్ కూడా సమానంగా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఎక్కువ పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో నెమ్మదిగా లోపలి స్టఫింగ్ చెదిరిపోకుండా జాగ్రత్తగా వత్తుకోవాలి. మిగిలిన పిండి ముద్దలతో కూడా ఇలాగే చేసుకోండి
-వత్తుకున్న కుల్చాల మీద ఉప్పు కలిపి ఉంచి నీళ్లను కొంచెం చల్లుకొని కుల్చా అంతా తడపాలి. ఆ తర్వాత కుల్చాల మీద కొంచెం కొత్తిమీర తరుగు చల్లి చేత్తో అద్దుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఇనుప పెనం పెట్టి అది బాగా వేడెక్కాక మాత్రమే రెడీ చేసిన కుల్చాని దానిమీద వేసి 3 నిమిషాలు వదిలేస్తే కుల్చా పొంగుతుంది. అప్పుడు మంటను మీడియంలో ఉంచి పాన్ ని తిరగేసి కుల్చాకి సెగ తగిలిస్తూ ఉంటే కుల్చా మొత్తం మచ్చలు ఏర్పడినట్లు పర్ఫెక్ట్ గా కాలుతుంది. దీంతో మనకు కావాల్సిన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత స్టవ్ ఆపేయండి.
-కుల్చా వేడిగా ఉన్నప్పుడే దానిమీద బాగా బటర్ పూసేయండి. దీంతో చల్లారిన తర్వాత కూడా కుల్చా మృదువుగా ఉంటుంది. అంతే అమృత్ సర్ కుల్చా రెడీ. దీనిని నచ్చిన చట్నీ లేదా రైతాతో తింటే స్వర్గమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications