Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
హైదరాబాద్ లో చదివా,దాల్ మఖ్ని అంటే ప్రాణం..సోమాలియా ఉప ప్రధాని మెచ్చిన రెసిపి ఇలా చేసుకుంటే కేక
స్విట్లర్జాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో పాల్గొనేందుకు వెళ్లిన సోమాలియా డిప్యూటీ ప్రధానమంత్రి సలా జమా(salah jama)తో తాజాగా ఇండియా టుడే ఛానెల్ కి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కొన్ని నిమిషాల ఇంటర్వ్యూ చేశారు.
ఈ సమయంలో సోమాలియా ఉప ప్రధాని స్వచ్ఛమైన హిందీలో మాట్లాడటం చూసి ఆశ్చర్యపోవడం రాజ్ దీప్ వంతైంది. తాను భారత్ లోనే చదువుకున్నానని, హైదరాబాద్, పూణే,ఢిల్లీలో తాను చాలాకాలం ఉన్నానని సలా జమా చెప్పారు. భారత్ లో తనకు ఇష్టమైన ఫుడ్ దాల్ మఖ్ని అని సోమాలియా డిప్యూటీ ప్రధాని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

భారతీయ వంటకాలలో, ముఖ్యంగా పంజాబీ వంటకాలలో దాల్ మఖ్నికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మఖ్ని అంటే వెన్న అని అర్థం. పేరుకు తగ్గట్టే ఈ వంటకం వెన్న, క్రీమ్ తో నిండి ఉండి, చాలా రుచిగా, క్రీమీగా ఉంటుంది. సాధారణంగా రెస్టారెంట్లలో లభించే ఈ దాల్ మఖ్నిని, అదే రుచితో, అదే చిక్కదనంతో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
ప్రధాన పదార్థాలు
పొట్టు మినపప్పు: 1 కప్పు
రాజ్మా: పావు కప్పు
నీళ్లు: తగినన్ని
ఉప్పు: రుచికి సరిపడా
వెన్న: 3-4 టేబుల్ స్పూన్లు
నూనె లేదా నెయ్యి: 1 టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకు: 1
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
టమాటో ప్యూరీ: ఒకటిన్నర కప్పులు(5టమాటోలు)
కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్: ఒకటిన్నర టీస్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
కసూరి మేతి : 1 టేబుల్ స్పూన్
ఫ్రెష్ క్రీమ్: అర కప్పు

తయారీ విధానం
-నల్ల మినుములు(పొట్టు మినపప్పు),రాజ్మాను ఒక గిన్నెలో తీసుకుని, నీళ్లతో 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి కనీసం 8-10 గంటలు నానబెట్టాలి.
-నానిన తర్వాత ఆ నీళ్లను వంపేసి, మళ్లీ శుభ్రమైన నీటితో పప్పును గట్టిగా రుద్దుతూ కడగాలి. ఇలా చేయడం వల్ల పప్పు పైన ఉండే నలుపు రంగు కొద్దిగా పోయి, దాల్ మఖ్ని మంచి రంగులో వస్తుంది.
-నానబెట్టిన పప్పును కుక్కర్ లో వేసి, సుమారు 3-4 కప్పుల నీళ్లు పోయాలి. దీనిలో ఒక టీస్పూన్ ఉప్పు, ఒక టీస్పూన్ కశ్మీరీ కారం వేయాలి. కుక్కర్ మూత పెట్టి సుమారు 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత సిమ్ లో పెట్టి మరో 15-20 నిమిషాలు ఉడికించాలి.
పప్పు మెత్తగా ఉడకాలి. పప్పును చేత్తో పట్టుకుంటే మాష్ అయిపోవాలి. ఇలా ఉడికిన పప్పులో నీళ్లు ఎక్కువగా ఉంటే పక్కకు తీసి పెట్టుకోవచ్చు లేదా అలాగే ఉంచవచ్చు.
-తర్వాత ఒక మందపాటి గిన్నె లేదా కడాయిని స్టవ్ మీద పెట్టి, అందులో 2 టేబుల్ స్పూన్ల వెన్న, 1 స్పూన్ నూనె వేడి చేసి అందులో బిర్యానీ ఆకు, తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి వెంటనే కలపాలి. వెంటనే మిక్సీలో టమాటోలు వేసి గుజ్జు చేసి దానిని కడాయిలో వేసి ఉడికించాలి.
-టమాటో మిశ్రమం ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పును నీళ్లతో సహా ఇందులో వేసి బాగా కలిపి అవసరమైతే కొంచెం వేడి నీళ్లు పోయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంటను పూర్తిగా తగ్గించి మూత పెట్టి 30 నుండి 45 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
-గ్రేవీ చిక్కగా, క్రీమీగా మారిన తర్వాత గరం మసాలా, కసూరి మేతి వేయాలి. చివరగా మిగిలిన వెన్న,ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలపాలి. క్రీమ్ వేసాక 2-3 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
-రెస్టారెంట్లో దాల్ మఖ్నికి ఒక రకమైన పొగ వాసన (Tandoori flavor) వస్తుంది. ఇందుకోసం ఒక చిన్న బొగ్గు ముక్కను నిప్పులపై ఎర్రగా కాల్చండి. దాల్ మఖ్ని గిన్నెలో మధ్యలో ఒక చిన్న స్టీల్ గిన్నె పెట్టండి. కాల్చిన బొగ్గును ఆ చిన్న గిన్నెలో పెట్టండి. ఆ బొగ్గుపై అర టీస్పూన్ నెయ్యి వేయండి. వెంటనే పొగ వస్తుంది. వెంటనే దాల్ గిన్నెపై మూత గట్టిగా పెట్టేయండి.
-2-3 నిమిషాల తర్వాత మూత తీసి, బొగ్గు గిన్నెను తీసివేయండి. ఇప్పుడు మీ దాల్ మఖ్నికి అద్భుతమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications