For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూజీ హల్వా తయారీః రవ్వకేసరి ఎలా తయారుచెయ్యాలి

Posted By: Lekhaka
|

అన్ని ప్రముఖ పండగలకి, కుటుంబ ఉత్సవాలకి చేసుకునే స్వీటు పదార్థం సూజీ హల్వా. దీన్నే దక్షిణ భారతంలో రవ్వకేసరి అని కూడా అంటారు. తేడా ఒక్క రంగులోనే వస్తుంది. సాధారణంగా మిఠాయి రంగు వేయటం వల్ల కాషాయ రంగు వస్తుంది.

రవ్వకేసరిని దేవునికి నైవేద్యంగా కూడా పెడతారు మరియు కుటుంబ ఫంక్షన్లలో కూడా చేసుకుంటారు. వేయించిన రవ్వ, ఏలకుల వాసన ఇది మరింత నోరూరించేలా చేస్తుంది.

కేసరి బాత్ ను ఇంట్లోనే సులువుగా, శ్రమలేకుండా తయారుచేసుకోవచ్చు. ఉండలు కట్టకుండా చూసుకోవటం ముఖ్యం. చిత్రాలు, వీడియోల సాయంతో తయారీవిధానం చదివి చేయండి.

సూజీ హల్వా రెసిపి। రవ్వ షీరా ఎలా తయారుచేయటం । సూజీ హల్వా తయారీ ।కేసరి బాత్ రెసిపి । రవ్వకేసరి తయారీ
సూజీ హల్వా రెసిపి। రవ్వ షీరా ఎలా తయారుచేయటం । సూజీ హల్వా తయారీ ।కేసరి బాత్ రెసిపి । రవ్వకేసరి తయారీ
Prep Time
5 Mins
Cook Time
20M
Total Time
25 Mins

Recipe By: మీనా బంఢారి

Recipe Type: స్వీట్లు

Serves: 2కి

Ingredients
  • రవ్వ - 1కప్పు

    నెయ్యి - 1 కప్పు

    పంచదార - ¾ కప్పు

    వేడినీరు - ఒకటిన్నర కప్పులు

    ఏలకుల పొడి - 1చెంచా

    తరిగిన బాదం - అలంకరణకి

    తరిగిన జీడిపప్పు - అలంకరణకి

    కుంకుమపువ్వు రేకులు - 4-8 అలంకరణకి

How to Prepare
  • 1. వేడిపెనంలో నెయ్యి వేయండి.

    2. నెయ్యి కరగగానే, రవ్వ వేసి అది బంగారు రంగులోకి మారేవరకు, పచ్చివాసన పోయేవరకూ వేయించండి.

    3. వేడినీరును జతచేయండి.

    4. చక్కెర కూడా వేసి, ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి.

    5. పంచదార కరిగి, మిశ్రమం గట్టిపడాలి.

    6.అప్పుడు ఏలకుల పొడి వేసి, బాగా కలపండి.

    7.మిశ్రమం పెనం బయటకి వచ్చేస్తూ, గట్టిపడుతుంది.

    8. స్టవ్ మీదనుండి పెనం తీసేసి, రవ్వ హల్వాను గిన్నెలోకి తీసుకోండి.

    9. తరిగిన బాదం, జీడిపప్పు, కుంకుమపువ్వు రేకులతో అలంకరించండి.

Instructions
  • 1. పచ్చివాసన పోయేవరకూ రవ్వను వేయించండి.
  • 2. వేడినీరును హల్వా గట్టిపడి, ఉండలు కట్టకుండా ఉండటానికి జతచేస్తారు.
Nutritional Information
  • సరిపోయే పరిమాణం - 1 కప్పు
  • క్యాలరీలు - 447 క్యాలరీలు
  • కొవ్వు - 28గ్రాములు
  • ప్రొటీన్ - 4గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 48 గ్రాములు
  • చక్కెర - 27 గ్రాములు
  • ఫైబర్ - 1 గ్రాము

స్టెప్ బై స్టెప్ - రవ్వకేసరి తయారీ ఎలా

1. వేడిపెనంలో నెయ్యి వేయండి.

2. నెయ్యి కరగగానే, రవ్వ వేసి అది బంగారు రంగులోకి మారేవరకు, పచ్చివాసన పోయేవరకూ వేయించండి.

3. వేడినీరును జతచేయండి.

4. చక్కెర కూడా వేసి, ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి.

5. పంచదార కరిగి, మిశ్రమం గట్టిపడాలి.

6.అప్పుడు ఏలకుల పొడి వేసి, బాగా కలపండి.

7.మిశ్రమం పెనం బయటకి వచ్చేస్తూ, గట్టిపడుతుంది.

8. స్టవ్ మీదనుండి పెనం తీసేసి, రవ్వ హల్వాను గిన్నెలోకి తీసుకోండి.

9. తరిగిన బాదం, జీడిపప్పు, కుంకుమపువ్వు రేకులతో అలంకరించండి.

[ 5 of 5 - 75 Users]
English summary

Sooji Halwa Recipe | How To Make Rava Sheera | Suji Ka Halwa Recipe | Kesari Bhath Recipe | Rava Kesari Recipe

Sooji halwa recipe is a simple traditional sweet that is prepared all over India during festivals and religious ceremonies. Watch the video recipe
Desktop Bottom Promotion