Latest Updates
-
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..?
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
సొరకాయ అనగానే చాలామంది పెదవి విరుస్తుంటారు. ముఖ్యంగా పిల్లలకైతే సొరకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు. పోషకాలు పుష్కలంగా ఉండే ఈ సొరకాయతో ఎప్పుడూ ఒకేలా కూర, పప్పు లేదా పచ్చడి కాకుండా కాస్త వెరైటీగా, స్పైసీగా ఏదైనా స్నాక్ చేస్తే ఎలా ఉంటుంది? అదే సొరకాయ ఫింగర్స్.
ఇవి బయట కరకరలాడుతూ, లోపల ఎంతో మృదువుగా ఉండి అద్భుతమైన రుచిని ఇస్తాయి. కరకరలాడే సొరకాయ ఫింగర్స్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

సొరకాయ ఫింగర్స్ తయారీకి కావలసిన పదార్థాలు
లేత సొరకాయ - 1
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
తెల్ల నువ్వులు - 1 టేబుల్ స్పూన్
బొంబాయి రవ్వ (సూజీ) - మిశ్రమానికి సరిపడా
కారం పొడి - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాల పొడి - అర టీస్పూన్
గరం మసాలా - పావు టీస్పూన్
నీరు - అవసరమైనంత
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి..
సొరకాయ ఫింగర్స్ తయారీ విధానం
-ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి, తొక్క తీసేసి సన్నగా తురుముకోవాలి.
-ఒక మందపాటి బాండీలో కొద్దిగా నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగాక జీలకర్ర, తెల్ల నువ్వులు వేసి మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించండి.
-నువ్వులు వేగిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న సొరకాయ తురుమును వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి.
-సొరకాయ మెత్తబడ్డాక, అందులో బొంబాయి రవ్వ, కారం, పసుపు, ఉప్పు,
ధనియాల పొడి, గరం మసాలా వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్లు పోస్తూ, గట్టిగా కలుపుకోవాలి. పిండి
బాణలి అంచులకు అంటుకోకుండా ముద్దలా అయ్యేవరకు చిన్న మంటపై ఉడికించండి.
పిండి మరీ తడిగా ఉంటే వేళ్ళ ఆకారం రాదు, కాబట్టి జాగ్రత్త
వహించండి.
-ఇప్పుడు స్టవ్ ఆపేసి, మిశ్రమాన్ని గోరువెచ్చగా అయ్యేలా చల్లారనివ్వండి. చేతులకు కాస్త నూనె రాసుకుని, పిండిని పొడవాటి వేళ్ల ఆకారంలో (ఫింగర్స్ ) మలుచుకోండి. అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోండి.
-బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కాక, తయారు చేసిన సొరకాయ వేళ్ళను నూనెలో వేయండి. మంటను మీడియంలో ఉంచి, అవి కరకరలాడే బంగారు గోధుమ రంగులోకి మారేంత వరకు వేయించండి.
-మంచి రంగు వచ్చాక వాటిని తీసి, అదనపు నూనెను పీల్చుకోవడానికి టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్ లోకి తీసుకోండి.
-అంతే క్రిస్పీ సొరకాయ ఫింగర్స్ రెడీ. ఈ కరకరలాడే స్నాక్స్ ను గ్రీన్ చట్నీ లేదా టొమాటో సాస్ లో ముంచుకుని తింటుంటే ఆ మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
