For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎగ్ లెస్ కేక్: క్రిస్మస్ స్పెషల్ (ఓవెన్ అవసరం లేకుండా)

|

క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అంటేనే ముందుగా మనకు కేక్సే గుర్తుకు వస్తాయి. క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, కేక్ లేకుండా మనం ఊహించుకోలేము. అంత స్పేషలిటి కేకులకు ఉంది. ఈ కేకులను మీరు మార్కెట్లో కొనుగోలు చేసిన లేదా ఇంట్లో తయారుచేసుకొన్నా సరే కేక్ కు ప్రత్యేకమైన స్థానం కలదు . క్రిస్మస్ వేడుకల్లో కేక్ తప్పనిసరి...

క్రిస్మస్ కు కేక్ ను ఇంట్లో తయారుచేసుకోవడం ఒక గొప్ప అనుభూతి. ఎందుకంటే ఇంట్లో తయారుచేసే కేక్స్ మనకు నచ్చిన విధంగా , క్లీన్ గా హెల్తీగా తయారుచేసుకోవాలి. కేక్స్ ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. అయితే కొంత మంది గుడ్డు తినరు. అటువంటి వారికోసం ఒక స్పెషల్ ఎగ్ లెస్ కేక్ మీకోసం ఈ క్రిస్మస్ సందర్భంగా పరిచయం చేస్తున్నాం. మరి మీరు కూడా ఇంట్లో ఏదైనా స్పెషల్ గా తయారుచేసుకోవాలని కోరుకుంటున్నట్లైతే వెంటనే ఈ ఎగ్ లెస్ కేక్ ను ట్రై చేసి ఎంజాయ్ చేయండి...

Christmas Special: Simple Eggless Cake Recipe Without Oven
Christmas Special: Simple Eggless Cake Recipe Without Oven

కావల్సిన పదార్థాలు:
మైదా: 1cup
కండెన్స్డ్ మిల్క్: 1/2cup
పంచదార పౌడర్: 1/4cup
జీడిపప్పు: 1tbsp
ద్రాక్ష: 1tbsp
బేకింగ్ సోడా: 1/41tsp
బేకింగ్ పౌడర్: 1/21tsp
బట్టర్: 1/4cup
పాలు: 1/2cup
ఉప్పు: చిటికెడు

Christmas Special: Simple Eggless Cake Recipe Without Oven

గ్రీస్ కోసం :
బట్టర్ : 1tbsp
మైదా : 1tbsp

Christmas Special: Simple Eggless Cake Recipe Without Oven

తయారుచేయు విధానం:
1. ముందుగా మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మూడింటిని బాగా మిక్స్ చేసి జల్లు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఇందులో పంచదార పొడి మరియు బట్టర్ రెండూ వేసి బాగా మిక్స్ చేయాలి. బట్టర్ స్మూత్ గా అయ్యే వరకూ మిక్స్ చేయాలి .
3. ఇప్పుడు అందులోనే కండెన్డ్ మిల్క్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి.
4. సగం పాలు కూడా పోసి మొత్తం మిశ్రమం స్మూత్ గా అయ్యే వరకూ మిక్స్ చేసుకోవాలి.

Christmas Special: Simple Eggless Cake Recipe Without Oven

5. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో అడుగున ఒక కప్పు ఉప్పు వేసి మంటను మీడియంగా పెట్టి, ఉప్పును వేడెక్కనివ్వాలి.
6. కండెన్స్డ్ మిల్క్ మైదా మిక్స్ ను క్లాక్ వైజ్ డైరెక్షన్ లో బాగా గిలకొట్టాలి. పిండి మొత్తం స్మూత్ గా అయ్యే వరకూ ఉండలు కట్టకుండా మిక్స్ చేయాలి. మరికొద్దిగా పాలు పోసి స్మూత్ గా కలుపుకోవాలి .
7. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బటర్ ను బేకింగ్ బౌల్ కు రాసి, దాని మీద ఒక టేబుల్ స్పూన్ మైదాను చిలకరించి తర్వాత లోపలి బౌల్ లోపలిబాగాన్ని కవర్ చేయాలి.

Christmas Special: Simple Eggless Cake Recipe Without Oven

8. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో జీడిపప్పు మరియు ద్రాక్ష వేసి మొత్తం మిశ్రమాన్ని మరోసారి మిక్స్ చేసి బేకింగ్ బౌల్లో మిక్స్ చేయాలి .
9.ఇప్పుడు ఈ బేకింగ్ బౌల్ ను కుక్కర్ లో పెట్టి మూత పెట్టాలి. విజిల్ పెట్టకూడదు.
10. తక్కువ మంట మీద 30-40నిముషాలు ఉడికించుకోవాలి. 40నిముషాల తర్వాత మూత తీసి బేకింగ్ బౌల్లో కేక్ మొత్తం, అన్ని వైపులా బ్రౌన్ కలర్ లోకి మారిందో లేదో సరిచూసుకోవాలి.

Christmas Special: Simple Eggless Cake Recipe Without Oven

11. తర్వాత చాకును కేకు లోపలికి చొప్పించి చూడాలి. పైకి తీసినప్పుడు , సులువగా చాకు బయటకు వస్తే అది తప్పనిసరిగా కేక్ తయారైనట్లే. అలా కాకుంటే మరో 10నిముషాలు తక్కువ మంట మీద తిరిగి బేక్ చేసుకోవాలి .
12. కేక్ రెడీ అయిన తర్వాత బేకింగ్ బౌల్ ను బయటకు తీసి, స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి.
13. చల్లారిన తర్వాత బేకింగ్ బౌల్ ను ఒక సర్వింగ్ ప్లేట్ మీద బోర్లించి కేక్ ను నిధానంగా రిమూవ్ చేయాలి. కేక్ మొత్తం బటకు తీసుకొన్న తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసి సర్వ్ చేయాలి. అంతే క్రిస్మస్ స్పెషల్ ఎగ్ లెస్ కేక్ రెడీ...

Christmas Special: Simple Eggless Cake Recipe Without Oven

English summary

Christmas Special: Simple Eggless Cake Recipe Without Oven

Christmas and cakes are synonymous. A Christmas without cakes is simply unimaginable. Whether you buy it from the market or you bake it at home, cake forms an essential part of the Christmas celebrations.
Desktop Bottom Promotion