For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తిమీర లెమన్ సూప్ : వింటర్ స్పెషల్

|

వింటర్ సీజన్ లో ప్రతి ఇంట్లోనూ సూప్స్ చాలా సాధారంగా తయారచేస్తుంటారు. చాలా త్వరగా మరియు సులభంగా తయారుచేసేటటువంటి వింటర్ సూపులు అనేకం ఉన్నాయి. వాటిలో టమోటో సూప్ ఒక మోస్ట్ కామన్ సూప్ రిసిపి. దీన్ని చాలా త్వరగా తయారుచేయవచ్చు. మరియు ఇది చాలా టేస్టీ కూడా.

బరువు తగ్గించే 10 బెస్ట్ సూప్స్: క్లిక్ చేయండి

వింటర్ సీజన్ లో మనకు అనేక గ్రీన్ వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ సూప్స్ మరింత టేస్టీగా ఉండాలంటే, వీటిలో కొన్ని పదార్థాలు కూడా జోడించాలి. ఈ సూపులకు కాస్త పుల్లని, కారం తగిలిస్తే చల్లికి నోటికి రుచికరంగా ఉంటుంది. అంతే కాదు చలికాలంలో చలిని ఎదుర్కొనే కొన్ని చిన్న అనారోగ్య సమస్యలను కూడా ఈ సూపులు నివారిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. డయాబెటిక్స్ ఉన్నవారికి గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ను మంచి కొలెస్ట్రాల్ గా మార్చుతాయి. ఇన్ని మంచి గుణాలున్నా ఈ హెల్తీ సూపులను వింటర్లో తప్పని సరిగా తీసుకోవల్సిందే..మరి ఈ సింపు సూప్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం..

Coriander And Lemon Soup

కావల్సిన పదార్థాలు:

సన్నగా తరిగిన కొత్తిమీర: 2tbsp
ఉల్లిపాయ: 1 (చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
స్ప్రింగ్ ఉల్లిపాయ(ఉల్లికాడలు): 1 (సన్నగా తరిగాలి)
అల్లం: 1 అంగుళం (చిన్న ముక్కలుగా చేయాలి)
వెల్లుల్లిపాయ: 1(సన్నగా కట్ చేయాలి)
నిమ్మరసం: 2tbsp
వెజిటబుల్ స్టాక్: 4 cups
మిరియాలు: 4-5 (పొడి చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
వెన్న: 1tsp

తయారుచేయు విధానం:
1. ఫ్రైయింగ్ పాన్ లో బటర్ వేసి కరిగిన తర్వాత అందులో, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, మరియు ఉల్లికాడ ముక్కలు అన్నింటిని వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి.
2. మొత్తం అన్నీ వేగుతూ లైట్ గా, మెత్తగా అయ్యే వరకూ వేయించుకోవాలి. 5నిముషాలు వేయించాలి.
3. ఇప్పుడు అందులో వెజిటేబుల్ స్టాక్(కూరగాయ ముక్కలు ఉడికించుకొన్న నీరు)పోసి బాగా ఉడికించాలి .
4. 5నిముషాల తర్వాత కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, బ్లాక్ పెప్పర్ పొడి వేసి అన్నింటిని మిక్స్ చేయాలి.
5. సూప్ చిక్కగా మారే సమయంలో స్టౌ ఆఫ్ చేసి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి. సర్వ్ చేసి ముందు బటర్ ను గార్నిస్ చేయాలి.

English summary

Coriander And Lemon Clear Soup Recipe

Soups are very commonly made in every household during the winters. There are many soup recipes that you can prepare at home within 20 minutes. Tomato soup is one of the most common soup recipes as it is quick and tastes delicious as well.
Story first published: Saturday, January 11, 2014, 17:29 [IST]
Desktop Bottom Promotion