For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన టమోటో ఫిష్ సూప్

|

సూప్స్ ఒక ఉత్తమ స్టార్టర్ గా ఉంటుంది. సూప్స్ ఆరోగ్యానికి మంచిది. సరైన పద్దతిలో తయారుచేస్తే పోషకవిలువలు మరిన్ని శరీరానికి అందుతాయి. సూప్స్ లో తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది మరియు ఇందులో న్యూట్రీషియన్స్ ఎక్కువ. ప్రతి రోజూ వివిధ రకాల సూపులను ప్రతి రోజూ తయారుచేయవచ్చు. ప్లెయిన్ టమోటో సూప్స్ నుండి వెజిటేబుల్ సూప్స్ వరకూ వివిధ రకాలు గా తయారుచేస్తుంటారు.

Tomato Fish Soup Recipe

కొన్ని రకాల సూపులను చికెన్ లేదా చేపలతో తయారుచేస్తారు . మీకు టమోటో సూపు అంటే ఇష్టంగా ఉంటే, మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే,అందులో చేపలను కూడా చేర్చి ఒక డిఫరెంట్ సూప్ ను తయారుచేయవచ్చు. ఈ సూప్ రిసిపి చాలా సులభం మరియు రుచికంగా ఉంటేంది. మరి ఈ టమోటో, ఫిష్ సూప్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
వైట్ చేప (సాల్మొన్, mackerel లేదా ట్రౌట్) - 5-8 ఔన్సులు
ఉల్లిపాయ 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 3-4 (తరిగినవి)
టమోటో సాస్: 1క్యాన్
ఓరిగానో: 1tsp
బాసిల్ ఆకులు: 2
బ్లాక్ పెప్పర్: 1tsp (పొడి చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 1cup
వెన్న: 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో బట్టర్ వేసి కరిగిన తర్వాత, అందులో ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
2. ఇప్పుడు అందులో ఉప్పు, బ్లాక్ పెప్పర్, ఒరిగానో మరియు తులసి ఆకులు వేసి బాగా నిధానంగా మిక్స్ చేస్తూ, అందులో నీళ్లు పోయాలి.
3. రెండు నిముషాలు ఎక్కువ మంట మీద ఉడికించుకొన్న తర్వాత, ఇప్పుడు అందులో టమోటో సాస్ వేసి సిమ్ లో పెట్టి బాగా మరిగించాలి. నీరు చిక్కగా మారుతున్న సమయంలో బాగా మిక్స్ చేసి, అందులో చేప ముక్కలు వేసి మరో 10నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
4. చేపముక్కలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఫిష్ టమోటో సూప్ త్రాగడానికి రెడీ. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.

English summary

Tomato Fish Soup Recipe

Soups are healthy and filling too. If prepared with the right cooking method, soups can be low in calories and also nutritious. You can prepare many types of soups every day to fight the chilling winter cold. From plain tomato soup to vegetable soup, you can go creative with ingredients.
Story first published: Monday, February 24, 2014, 17:25 [IST]
Desktop Bottom Promotion