For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై ఫ్రూట్స్ మ్యాంగో లస్సీ: సమ్మర్ స్పెషల్

|

పెరుగుతో తయారుచేసే డ్రింక్ ఐటమ్ మ్యాంగో లస్సీ ఒక పాపులర్ మరియు ట్రెడిషినల్ రిసిపి. ఇది ముఖ్యంగా పంజాబీల రిసిపి. అక్కడ బాగా ప్రసిద్ది చెందిన రిసిపి ఇది. ఏ రెస్టారెంట్ కు వెళ్లినా మ్యాంగో లస్సీ చాలా పాపులర్ గా ప్రతి రెస్టారెంట్ మెనులో ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని పెరుగు మరియు మామిడి పండ్ల ముక్కలతో తయారుచేస్తారు . ఇంకా ఇందులో మీరు పంచదార, పాలు మరియు యాలకలు వేసి మరింత టేస్టీగా మరియు ఫ్లేవర్ గా తయారుచేసుకోవచ్చు.

ఈడ్రై ఫ్రూట్ మ్యాంగో లస్సీ త్రాగడం వల్ల వేసవి సీజన్ లో వేడి వాతావరణంలో రిఫ్రెష్మెంట్ గా ఉంటుంది. మద్యలో టాపింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ ను కూడా వేస్తే మరింత రుచిగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా మ్యాంగో లస్సీకి మంచి పాపులారిటీ ఉంది .

ఇది యూఎస్, యుకె, మలేషియా, సింగరపూర్ మరియు ఇతర ప్రదేశాల్లో కూడా చాలా ఫేమస్ . ఇది రిఫ్రెషింగ్ డ్రింక్ మాత్రమే కాదు, ఇది హెల్తీ కూడా. పండ్లలో రారాజు ‘మామిడి' పండ్లు ఇందులో విటమిన్ ఎ, బి6, సి, ఇలు, మినిరల్స్, డైటరీ పైబర్, పోలీ ఫినోలిక్, ఫ్లెవనాయిడ్స్ యాంటీఆక్సిడెంట్స కాంపౌడ్స్ పుష్కలంగా ఉండి, ఆరోగ్యానికి గొప్పగా సహాయపడుతాయి. మరి డ్రై ఫ్రూట్స్ మ్యాంగో లస్సీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Dry Fruit Mango Lassi:Summer Special

కావల్సిన పదార్థాలు:
పెరగు: 1cup
మామిడికాయ: 1పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బాదంం 4-5(పొడి చేసుకోవాలి)
పిస్తాలు: 3-4(పొడిచేసుకోవాలి)
పంచదార: 3tsp
రోజ్ వాటర్: కొద్దిగా(రెండు మూడు చుక్కలు)
ఐస్ క్యూబ్స్ం 3-4

తయారుచేయు విధానం :
1. ముందుగా పెరుగు ఒక గిన్నెలో వడగట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీ జార్ లో వడగట్టుకొన్న చిక్కటి పెరుగు, మామిడిముక్కలు, కొద్దిగా నీళ్ళు పోయాలి. అందులోని పంచదర కూడా వేసి గ్రైండ్ చేయాలి.
3. ఇలా గ్రైండ్ చేసుకొన్న మిశ్రమంలో రెండు మూడు చుర్కల రోజ్ వాటర్ వేసి మరో సారి గ్రైండ్ చేసుకోవాలి .
4. ఇప్పుడు గ్రైండ్ చేసుకొన్న దాన్ని వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇలా చేడయం వల్ల ఫైబర్ మరియు మామిడి ముక్కలు తొలగించవచ్చు.
5. తర్వాత ఒక గ్లాసు తీసుకొని అందులో ఐస్ ముక్కలు వేసి, తర్వాత వడగట్టి పెట్టుకొన్న మ్యాంగో లస్సీ వేసి, డ్రైఫ్రూట్స్ పొడి, పలుకలతో గార్నిష్ చేయాలి. మీకు ఇష్టం అయితే గ్రైండ్ చేసేప్పుడే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను వేసి గ్రైండ్ చేసుకోవచ్చు.
6. అంతే డ్రైఫ్రూట్ మ్యాంగో లస్సీ రెడీ. .

English summary

Dry Fruit Mango Lassi:Summer Special

Dry fruit mango lassi. Whenever you go to any Punjabi restaurant or visit the green state, you would be welcomed with a glass of refreshing lassi.
Story first published: Thursday, April 23, 2015, 16:15 [IST]
Desktop Bottom Promotion