For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్ సీజన్ ఎంజాయ్ చేయాలంటే వేడి వేడి సూప్ త్రాగండి..

|

వింటర్ లో చలి... గిలి... ముఖ్యంగా ఆహారం మీద ఆసక్తిని తగ్గిస్తుంది. వేడి వేడిగా ఏదైనా తినాలి, ఏదైనా తాగాలి అనిపిస్తుంటుంది. అయితే సరిగ్గా ఆహారం తీసుకోక పోవటం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందక, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీనికో చక్కని పరిష్కారం సూప్స్. వేడి వేడిగా ఓ కప్పు సూప్ తాగితే నీరసమూ ఎగిరపోతుంది. శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. సూప్ ఒత్తిడిని తొగించి హృదయాన్ని తేలికపరుస్తుంది. ఆహారాన్ని తీసుకోవాలనే ఆత్రుతను రేపుతుంది.

వింటర్ సీజన్ లో చలిని తట్టుకోవాలన్నా, సీజన్ ను ఎంజాయ్ చేయాలన్నా వేడి వేడి, కారం కారంగా ఏదైనా సూప్ త్రాగితే ఎలా ఉంటుంది?అంతే కాదు, ఈ సూప్స్ వింటర్ చలిని తగ్గించడం మాత్రమే కాదు, ఈ సీజన్ లో వచ్చే కొన్ని చిన్న చిన్న ఆనారోగ్య సమస్యలను నివారిస్తుంది. దగ్గు, జలుబు వంటి వాటిని నుండి ఉపశమనం పొందేలా చేస్తాయి. ఈ సూపుల తయారీకి ఉపయోగించే కొన్ని మసాలాలు(పెప్పర్, పసుపు, అల్లం, వెల్లుల్లి)వంటివి చాలా త్వరగా కోలుకొనేలా చేస్తాయి.

చలికాలంలో వేడి వేడిగా తయారుచేసుకొనే ఈ సూప్స్ భలే మజా ఇస్తాయి. ఈ సూప్ ను ఏ వేళలో( బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్) అయినా సరే తీసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అమితంగా ఇష్టపడే ఈ హెల్తీ వింటర్ సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

వింటర్ ఇల్ నెస్ ను పోగొట్టే వేడి వేడి సూపులు..!

1. క్యారెట్‌-ఓట్ మీల్ సూప్: వింటర్ స్పెషల్సూప్ తయారీవిధానం:

1. క్యారెట్‌-ఓట్ మీల్ సూప్: వింటర్ స్పెషల్సూప్ తయారీవిధానం:

చలికాలంలో వేడి వేడిగా ఈ సూప్ భలే మజా ఇస్తుంది. ఈ సూప్ ను ఏ వేళలో( బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్) అయినా సరే తీసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అమితంగా ఇష్టపడే ఈ క్యారెట్ మరియు ఓట్ మీల్ సూప్ బరువును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుతుంది. మరి ఈ హెల్తీ వింటర్ సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

సూప్ తయారీవిధానం:

2. క్యారెట్ సూప్

2. క్యారెట్ సూప్

ఇది హెల్తీ మరియు పొట్టనింపే సూప్ రిసిపి. అంతే కాదు, మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఈ సీజన్ లో మనకు అన్ని రకాల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటాయి. మనకు నచ్చిన వెజిటేబుల్ తో డిఫరెంట్ ఫ్లేవర్ తో మనం తయారుచేసుకొని వింటర్ చలిని ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ హెల్తీ క్యారెట్ సూప్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

సూప్ తయారీవిధానం:

3.టమోటో సూప్-వింటర్ స్పెషల్

3.టమోటో సూప్-వింటర్ స్పెషల్

వింటర్ లో చలి... గిలి... ముఖ్యంగా ఆహారం మీద ఆసక్తిని తగ్గిస్తుంది. వేడి వేడిగా ఏదైనా తినాలి, ఏదైనా తాగాలి అనిపస్తుంటుంది. అయితే సరిగ్గా ఆహారం తీసుకోక పోవటం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందక, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీనికో చక్కని పరిష్కారం సూప్. వేడి వేడిగా ఓ కప్పు సూప్ తాగితే నీరసమూ ఎగిరపోతుంది. శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. సూప్ ఒత్తిడిని తొగించి హృదయాన్ని తేలికపరుస్తుంది. ఆహారాన్ని తీసుకోవాలనే ఆత్రుతను రేపుతుంది. మరీ అలాంటి సూప్ ను ఓసారి ట్రై చేసి చూడండి...

సూప్ తయారీవిధానం:

4. వెజిటబుల్ పాస్తా సూప్-వింటర్ స్పెషల్

4. వెజిటబుల్ పాస్తా సూప్-వింటర్ స్పెషల్

వెజిటేబుల్ పాస్తా సూప్ వింటర్ సీజన్ లో హెల్త్ బూస్టర్ వంటిది . దీన్ని వింటర్ సీజన్ లో తీసుకోవడం ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరం . సీజనల్ గా వచ్చే అనారోగ్య సమస్యలను నుండి మన శరీరానికి తగిన రక్షణ కల్పించడంలో వింటర్ వెజిటేబుల్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. అలాంటి సీజనల్ వెజిటేబుల్స్ ను సూప్స్ గా తీసుకుంటే ఎనర్జీ బూస్టర్ గా మనల్ని ఉత్సహాపరుత్సాయి. తగిన పోషకాలు శరీరానికి అందేలా చేస్తాయి.

సూప్ తయారీవిధానం:

5. రుచికరమైన టమోటో ఫిష్ సూప్

5. రుచికరమైన టమోటో ఫిష్ సూప్

సూప్స్ ఒక ఉత్తమ స్టార్టర్ గా ఉంటుంది. సూప్స్ ఆరోగ్యానికి మంచిది. సరైన పద్దతిలో తయారుచేస్తే పోషకవిలువలు మరిన్ని శరీరానికి అందుతాయి. సూప్స్ లో తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది మరియు ఇందులో న్యూట్రీషియన్స్ ఎక్కువ. ప్రతి రోజూ వివిధ రకాల సూపులను ప్రతి రోజూ తయారుచేయవచ్చు. ప్లెయిన్ టమోటో సూప్స్ నుండి వెజిటేబుల్ సూప్స్ వరకూ వివిధ రకాలు గా తయారుచేస్తుంటారు.వాటిలో టమోటో ఫిష్ సూప్. వింటర్లో ఇమ్యూనిటిని పెంచే సూప్ ఇది.

సూప్ తయారీవిధానం:

6. హెల్తీ ఓట్స్ సూప్ రిసిపి : వింటర్ స్పెషల్

6. హెల్తీ ఓట్స్ సూప్ రిసిపి : వింటర్ స్పెషల్

ఓట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ఓట్స్ తో సూప్ తయారుచేయడం అనేది ఒక బెస్ట్ ఐడియా. ఓట్స్ సూప్ రిసిపి చాలా సులభంగా పది నిముషాల్లో తయారుచేసేయవచ్చు. చలికాలంలో హాట్ అండ్ స్పైసీగా త్రాగాలంటే ఈ ఓట్స్ సూప్ రిసిపి ఒక ఉత్తమ ఎంపిక. ఓట్స్ ను సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు. అయితే చలికాలంలో ఈవెనింగ్ టైల్ లో కూడా ఏదైనా హెల్తీగా స్పైసీగా తీసుకోవాలనుకొన్నప్పుడు ఇది ఒక ఉత్తమ ఎంపిక మరి ఈ హాట్ అండ్ స్పైసీ ఓట్స్ సూప్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం....

సూప్ తయారీవిధానం:

7. పన్నీర్ ఆనియన్ సూప్

7. పన్నీర్ ఆనియన్ సూప్

సూప్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉపయోగకరమైనది. భోజనంలో పాటు తీసుకోవచ్చు. లేదా సాయంత్ర సమయంలో ఈ సూప్ ను తీసుకోవచ్చు. సీజన్ బట్టి సూప్ లను తయారు చేసుకోవచ్చు. సూప్ ను తాగడం వల్ల బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సూప్స్ వివిధ రకాలుగా తయారు చేసుకోవచ్చు. అయితే అందులో పన్నీర్ మరియు ఉల్లిపాయతో తయారు చేసే సూప్ చాలా సులభం మరియు టేస్టీ, హెల్తీ కూడా.. ఒక సారీ మీరూ ప్రయత్నించి చూడండి..

సూప్ తయారీవిధానం:

8. చికెన్ మష్రూమ్ సూప్ : మాన్ సూన్ స్పెషల్

8. చికెన్ మష్రూమ్ సూప్ : మాన్ సూన్ స్పెషల్

చికెన్ మష్రుమ్ సూప్ వీటిలో ఉపయోగించే హెర్బ్స్ కామన్ ఫ్లూను నివారిస్తుంది. ఈ మష్రుమ్ మరియు చికెన్ సూప్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ సూప్ లో అనే ఔషదగుణగణాలు కూడా ఉన్నాయి. అంతే కాదు మీ టేస్ట్ బడ్స్ కు చాలా రుచికరంగా అనిపిస్తుంది. కాబట్టి, చలికాలంలో ఇటువంటి సూపలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవేయడానికి లేదు. మరియు ఈసాయంత్రపు మీ ఆకలికోరికలను తీర్చుకోవడానికి ఇవి ఒక ఆరోగ్యకరమైన వంటలు.

సూప్ తయారీవిధానం:

9. స్పైసీ చికెన్ రైస్ సూప్ ను ఓ పట్టు పట్టండి...

9. స్పైసీ చికెన్ రైస్ సూప్ ను ఓ పట్టు పట్టండి...

సాధారణంగా వర్షాకాలమో, శీతాకాలమో వచ్చిందంటే చాలు ఇంట్లో నుండి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టం ఉండదు చాలా మందికి. ఎముకలు కొరికే చల్లగాలిలో బద్దకం. వంటగదిలోకి వెళ్ళడానికి మనసు మారాం చేస్తుంది. చలిగాలికి, వర్షానికి గొంతులోకి కాస్త వేడి వేడిగా టీనో, కాఫీనో... కానీ ఎప్పుడూ అవేనా? సూప్ లు ఉన్నాయి కదా.. ఒక పట్టు పట్టవచ్చు కదా. ఉప్పు, కారం, ఒకటి రెండు కూరగాయలు కలిపి మరిగించి స్పూన్ తో నోటికి అందుకుంటే ఆకలి అందుకుంటుంది. బద్దకం పారిపోతుంది.

సూప్ తయారీవిధానం:

10. జింజర్ సూప్

10. జింజర్ సూప్

బుతువును బట్టి వాతావరణంలో మార్పులు చోటు చేసుకొంటాయి. వాతారవణంలో మార్పులతో చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా శీతాకాంలో జలుబు, దగ్గు మరియు జ్వరం వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్, ముక్కులో కారడం, ఎక్కువగా తలనొప్పి వంటివి అతి సాధారణంగా, సహజంగా వచ్చేటటువంటి సమస్యలు. అయితే వీటికి మాత్రలు తీసుకొన్న వేడిగా ఒక కప్పు కాఫీ లేదా టీ లేద సూప్ తాగాలనిపిస్తుంది. అలాంటి సూప్ లలో జింజర్ సూప్ ఒకటి.

సూప్ తయారీవిధానం:

English summary

TOP 10 Healthy And Tasty Soup Recipes FOR Winter Evening..!

Soups are the best things that you can try this evening. A bowl of soup on a chilly winter evening can complete your day. If you are hungry, the best thing you can do is to have a sip of your favourite soup.
Story first published: Wednesday, December 9, 2015, 15:38 [IST]
Desktop Bottom Promotion