For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ అండ్ ఫ్లేవరబుల్ వెనీలా మిల్క్ షేక్

|

మిల్క్ షేక్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గొప్పగా ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తాయి. ముఖ్యంగా ఉదయం తీసుకొనే మిల్క్ షేక్స్ వల్ల శరీరానికి అవసరం అయ్యే పూర్తి పోషకాలు అందజేస్తాయి.

అటువంటి మిల్క్ షేక్స్ లో ఒకటి వెనీలా మిల్క్ షేక్. సాధారణంగా మిల్క్ షేక్స్ ను వివిధ రకాలుగా తయారు చేస్తుంటారు. ఐతే వెనీలాతో తయారు చేసే మిల్క్ షేక్ చాలా డిఫరెంట్ గా అద్భుతమైన రుచితో ఉంటుంది. వెనీలా ఫ్లేవర్ ను అమితంగా ఇష్టపడే వారికి, ఈ వెనీలా మిల్క్ షేక్ ఒక అద్భుతమైన ట్రీట్.

ఈ వెనీలా మిల్క్ షేక్ మరింత టేస్ట్ గా ఉంటుంది. మీరు ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నారా, అయితే మీరు ఆలస్యం చేయకుండా వెనీలా మిల్క్ షేక్ ఇవవచ్చు . అప్పుడు వారు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు.

Easy And Tasty Vanilla Milkshake Recipe

కావల్సిన పదార్థాలు:
వెనీలా ఎక్సాస్ట్ - 3teaspoon
షుగర్ - 2 cups
పాలు - 250 ml
వెనీలా ఐస్ క్రీమ్ - 2 cups
దాల్చిన చెక్క - చిన్న ముక్క
యాలకలు - 2
ఐస్ క్యూబ్స్ - 5 to 6

తయారుచేయు విధానం:
1. మిక్సీ జార్ తీసుకొని అందులో పాలు, ఐస్ క్రీమ్, షుగర్ వేసి మొత్తగా బ్లెడ్ చేయాలి.

2. తర్వాత అందులో దాల్చిన చెక్క, యాలకలు, వెనీల ఎక్స్ ట్రాక్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని బ్లెడ్ చేయాలి.

3. ఈ మిక్సీ జార్లో ఐస్ క్యూబ్స్ వేసి తిరిగి బ్లెడ్ చేయాలి. ఇది తప్పనిసరి

4. ఈ మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాసులోకి మార్చుకోవాలి.

5. మిక్సీ జార్లో ఐస్ క్యూబ్స్ వేయకపోతే, ఇప్పుడు సర్వింగ్ గ్లాసులో వేసుకోవచ్చు. మరి ఈ చల్ల చల్లని వెనీలా మిల్క్ షేక్ ను సర్వ్ చేయండి.

English summary

Easy And Tasty Vanilla Milkshake Recipe

Easy And Tasty Vanilla Milkshake Recipe, So, today at Boldsky we shall share with you an easy vanilla milkshake recipe. You can prepare this recipe as an evening drink or serve it after your dinner. Some people have a pratice to drink milk before going to bed.
Story first published: Friday, January 8, 2016, 16:51 [IST]
Desktop Bottom Promotion