For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యమ్మీయమ్మీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ రిసిిప: క్రిస్మస్ స్పెషల్

By Lekhaka
|

క్రిస్మస్ దగ్గరలో ఉంది, ఇదే కేకులు, పేస్ట్రీలు, కూకీస్ కి సరైన సమయం. క్రిస్మస్ రోజు శాంటా క్లాజ్ ని బ్లాక్ ఫారెస్ట్ కేక్ తో ఆహ్వానించడం చాలా రుచికరంగా ఉంటుంది. ఈ కేకు చాలా అందంగా కనిపించడమే కాకుండా చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు మీ అమ్మాయి/అబ్బాయి పుట్టినరోజుని చాలా సంతోషంగా జరపాలి అనుకుంటే, మీరు ఇంట్లోనే ఈ బ్లాక్ ఫారెస్ట్ కేకుని బెక్ చేయండి.

ఇది మీ బాబు/పాప కి చాలా గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, వారు వారి స్నేహితులతో చాలా బాగా ఆనందిస్తారు. మీరు ఇంట్లోనే ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ ని బెక్ చేయడం కుదిరితే మీరే ఆశ్చర్యపోతారు. నమ్మండి, చాలా తేలికైన పద్ధతిలో దీనిని తయారుచేసుకోవచ్చు.

ఇక్కడ ఇంట్లో తయారుచేసుకునే వంటకం, వాటికి కావాల్సిన పదార్ధాలు ఇవ్వబడ్డాయి.

ఏర్పాటు చేసుకోడానికి పట్టే సమయం - 20 నిముషాలు

వండడానికి పట్టే సమయం - 30 నిముషాలు

కావాల్సిన పదార్ధాలు

కేక్ కోసం

1. చాకొలేట్ కేక్ - 1

2. మెత్తని క్రీమ్ - 4 కప్పులు (బీట్ చేసింది)

3. కాన్ చెర్రీలు - 16 (ముక్కలుగా కట్ చేసినవి)

పంచదార సిరప్ కోసం

4. పంచదార - ½ కప్పు

5. నీళ్ళు - ¾ వంతు కప్పు

అలంకరణకు

6. చాక్లెట్ కర్ల్స్ - 1 ¼ కప్పు

7. కాండ్ చెర్రీలు - 10 (మొత్తం)

ఇది కూడా చదవండి: క్రిస్మస్ పార్టీ కోసం 15 అద్భుతమైన వంటలు

తయారుచేసే విధానం:

1. ఒక చాకొలేట్ కేక్ కొనండి. ఎగ్ లేనివి కూడా తేలికగా అందుబాటులో ఉన్నాయి. దాన్ని 3 పొరలుగా కట్ చేయండి. ఇప్పుడు, మీరు పంచదార సిరప్ ని తయారుచేసి అందులో ఈ కేక్ ని ముంచండి. ఒక గిన్నెను తీసుకుని అందులో నీరు, పంచదార వేయండి. పంచదార నీటిలో కరిగే వరకు మరగనివ్వండి.

నోరూరించే బ్లాక్ ఫారెస్ట్ కేక్ రిసిపి

2. ఫ్లేవర్ కలపడానికి, మీరు బ్రాందీ, రమ్ వంటి ఎటువంటి లిక్కర్ నైనా కలపొచ్చు. మరగనిచ్చి స్టవ్ ఆపేయండి. షుగర్ సిరప్ గది ఉష్ణోగ్రతకు వచ్చే దాకా చల్లారనివ్వండి. ఇప్పుడు, పెద్ద గిన్నె తీసుకుని, క్రీమ్ ని బాగా కలపడం మొదలుపెటండి. ఆ క్రీమ్ నురగగా, మృదువుగా అయ్యేవరకు కలపండి.

నోరూరించే బ్లాక్ ఫారెస్ట్ కేక్ రిసిపి

3. కేక్ స్టాండ్ తీసుకుని, దానిలో ఒక కేక్ లేయర్ పెట్టండి. ఇప్పుడు, దానిమీద పంచదార సిరప్ పోయండి, దానిమీద బీట్ చేసిన క్రీమ్ ని కూడా రాయండి.

నోరూరించే బ్లాక్ ఫారెస్ట్ కేక్ రిసిపి

4. కేక్ పొరల మీద క్రీమ్ ని బాగా మందంగా పూయండి. ఇప్పుడు, కేక్ లేయర్ మీద చేర్రీస్ పెట్టండి. మీరు చెర్రీ మొత్తాన్ని పెట్టొచ్చు లేదా ముక్కలుగా చేసి పెట్టొచ్చు.

నోరూరించే బ్లాక్ ఫారెస్ట్ కేక్ రిసిపి

5. రెండవ పోరని పెట్టండి, మళ్ళీ పైలాగే అప్లై చేయండి. అలాగే మూడవ పొరను కూడా పెట్టి పై విధానాన్ని అనుసరించండి. తరువాత, కేక్ మొత్తాన్ని క్రీమ్ తో కవర్ చేసి, మృదువుగా ఉండేట్టు చేయండి. చాకొలేట్ బర్ నుండి చాకొలేట్ కర్ల్స్ తయారుచేసి, కర్ల్స్ తో కేక్ అలంకరించి, చేర్రీస్ తో కేక్ ని అలంకరించండి.

Mouth-watering Black Forest Cake Recipe: Christmas Special

6. కేక్ పక్కల వైపు చాకొలేట్ కర్ల్స్ పుల్లలు పెట్టడం మరవకండి. మీరు ఇంట్లో చేసిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ తయారైనట్టే.

7. దాన్ని కట్ చేసి, మీ అతిధులకు సర్వ్ చేయండి.

English summary

Mouth-watering Black Forest Cake Recipe: Christmas Special

Christmas is near and this is the time of cakes, pastries and cookies. Black forest cake is really yummy to welcome Santa Clause on Christmas. This cake looks so adorable and tastes great too. If you want to make your kids super happy on his/her birthday, you can bake this black forest cake at home.
Story first published:Friday, December 9, 2016, 12:55 [IST]
Desktop Bottom Promotion