Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మిగిలిపోయిన అన్నంతో టమాటో పులావ్..ఏడు జన్మలెత్తినా మర్చిపోలేని రుచి,ఇదిగో రెసిపి
టమాటో పులావ్ పేరు వింటేనే నోరూరిపోతుందా? చేసుకొని తింటే ఏడు జన్మలెత్తినా దీని టేస్ట్ మాత్రం మర్చిపోలేరు..అంత రుచిగా ఉంటుంది. అంతేకాకుండా దీనిని తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ. బ్యాచిలర్స్ కూడా తమ రూమ్స్ లో చాలా ఈజీగా చేసుకునే వంటకం ఇది. టమాటో పులావ్ ని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
టమాటో పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-టమాటో
-లవంగాలు
-యాలకలు
-షాజీరా
-ఉల్లిపాయ
-ఆయిల్
-నెయ్యి
-ఉప్పు
-కారం
-గరం మసాలా
-ధనియాల పొడి
-బాస్మతి రైస్ లేదా మిగిలిపోయిన అన్నం

టమాటో పులావ్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేయండి.
-ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకలు, అర టీస్పూన్ షాజీరా, ఒక ఉల్లిపాయ చీలికలు వేసి బంగారు గోధుమ రంగె వచ్చే వరకు వేపుకోండి.
-తర్వాత అందులో 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపిన తర్వాత రెండు పెద్ద టమాటోల గుజ్జు వేయాలి. ఇందుకోసం టమాటోలను మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోండి. దానిని పాన్ లో వేయాలి.
-తర్వాత అందులో అర చెంచా ధనియాల పొడి, అర చెంచా గరం మసాలా,1 టీస్పూన్ కారం,రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలిపి పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేంతవరకు వేయించుకోండి.
-తర్వాత అందులో 3 టమాటోల ముక్కలు వేసి పచ్చి వాసన పోయేంతవరకు మగ్గించుకోండి.
-తర్వాత కొద్దిసేపు నానబెట్టి వండిన బాస్మతి బియ్యం 1 కప్పు ఇందులో వేసి బాగా కలుపుకోండి. ఇంట్లో మిగిలిపోయిన అన్నం కూడా వేసుకోవచ్చు. రైస్ వేసి కలిపిన తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీ టమాటో పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
