Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇరానీ చాయ్‌ని.. “స్పెషల్ మసాలా టీ” ఇంట్లోనే ఇలా చేసుకోండి!
'టీ' ఇది పేరు మాత్రమే కాదు. ఇదొక ఎమోషన్. టీ అనే పదం వింటే చాలు చాలా మందికి ప్రాణం లేచి వస్తుంది. ఇంకొదరికైతే టీ లేనిదే రోజు కూడా గడవదు. ఒక్క పూట టీ మిస్ అయ్యిందంటే.. ఇక రోజంతా దీనంగా ఉండిపోతారు. నలుగురు ఒక చోట కలిసినా.. ఇంట్లోకి బంధువులు వచ్చినా తప్పనిసరిగా టీ ఉండాల్సిందే. అంతలా ఇమిడిపోయిన ఈ టీని ఇంట్లో చేసుకునేటప్పుడు హోటళ్లు తాగినప్పుడు వచ్చే కమ్మటి టేస్ట్ రాదు. అందుకే ఈరోజు హోటళ్ల మాదిరిగా.. కమ్మగా ఉండే స్పెషల్ మసాలా టీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు:
ఈ స్పెషల్ మసాలా టీని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను
ఇప్పుడు తెలుసుకుందాం.
పావు లీటర్ పాలు
రెండు టేబుల్ స్పూన్ అల్లం తురుము
మూడు టేబుల్ స్పూన్ల టీ పొడి
నాలుగు లవంగాలు
అయిదు యాలకులు
రెండు టేబుల్ స్పూన్ల గులాబీ రెబ్బలు
ఒక చిన్న ముక్క దాల్చినా చెక్క
సరిపడా చెక్కెర

తయారీ విధానం:
ముందుగా పెనంపై టీ కాచే గిన్నెను పెట్టుకొని అందులో పాలు పోసి, పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. అనంతరం ఆ పాల గిన్నెను పక్కన పెట్టుకోవాలి. అనంతరం.. ఒక చిన్న పాత్ర తీసుకొని అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్లు కొంచెం మరిగాక.. అందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న యాలకులు, అల్లం తురుము, లవంగాలు, దాల్చిన చెక్కను వేసి కాసేపు మరిగించుకోవాలి.
ఒకవేళ మీకు టీ మసాలా రుచిలో ఉండడం ఇష్టం ఉండకపోతే, మసాలా టీ వద్దు అనుకుంటే.. మీరు లవంగాలు, దాల్చిన చెక్క లేకుండానే టీని తయారు చేసుకోవచ్చు. తరువాత బాగా మరిగిన ఆ డికాషన్ లో టీ పొడి, సరిపడా చెక్కర వేసుకొని.. రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. డికాషన్ బాగా మరిగిన తరువాత.. ఇందులో మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్న పాలను పోసుకోవాలి. అలాగే రెండు టేబుల్ స్పూన్ల గులాబీ రెబ్బలను కూడా కలుపుకోవాలి.
గులాబీ రెబ్బలను టీలో కలుపుకోవడం ద్వారా టీ మంచి రుచిగా ఉండడంతో పాటు చిక్కగా, సువాసన భరితంగా ఉంటుంది. తరువాత స్టవ్ ను మీడియం మంటలో ఉంచుకొని.. గరిటెతో టీని కలుపుతూ అయిదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. అనంతరం వేడివేడి టీని ఒక కప్పులో వడబోసి పోసుకుంటే సరి. వేడి వేడి హోటళ్ల మాదిరిగా స్పెషల్ మసాలా టీ సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications