Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఉల్లి, వెల్లుల్లితో ఇలా చట్నీ చేస్తే..లెక్కలేకుండా ఇడ్లీలు లాగించేస్తారు!
పొద్దున్నే టిఫిన్ లోకి ఏంటి అనగానే ఎక్కువమంది తెలుగువారికి ముందుగా గుర్తుకొచ్చేది ఇడ్లీ,దోశలే. అయితే రోజూ ఇడ్లీ,దోశలే తింటే బోర్ కొట్టడం సహజం. ముఖ్యంగా వీటిలోకి నంజుకునే చట్నీల విషయంలో మనం పెద్దగా ప్రయోగాలు చేయం. ఎప్పుడూ పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ లేదా టమోటా చట్నీనే వండుతుంటాం.
కానీ అప్పుడప్పుడు నోటికి ఘాటుగా, రుచిగా ఏదైనా తినాలనిపిస్తుంటది. అలాంటప్పుడు చెట్టినాడు స్పైసీ చట్నీ ఓ సారి ట్రై చేయాల్సిందే. దీనిని కార చట్నీ అని కూడా పిలుస్తారు. చెట్టినాడు వంటకాలు అనగానే ఆ స్పైసీ నెస్, ఆ రుచి వేరే లెవల్ లో ఉంటాయి. కేవలం ఇంట్లో ఉండే ఉల్లి, వెల్లుల్లి, మిరపకాయలతో నిమిషాల్లో దీనిని రెడీ చేసుకోవచ్చు. నోరూరించే చెట్టినాడు స్పైసీ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
చిన్న ఉల్లిపాయలు (సాంబార్ ఉల్లిపాయలు) - 1 కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 8
ఎండు మిరపకాయలు - 6
కాశ్మీరీ ఎండు మిరపకాయలు - 2
చింతపండు - చిన్న ఉసిరికాయంత
నూనె - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నువ్వుల నూనె- 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయ - 1
కరివేపాకు - 1 రెమ్మ
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక, సాధారణ ఎండు మిరపకాయలు, కశ్మీరీ ఎండు మిరపకాయలను వేసి మాడిపోకుండా దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో ఉన్న నూనెలో వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. అవి కాస్త వేగాక, ఒక కప్పు చిన్న ఉల్లిపాయలను వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఉల్లిపాయలు లేత బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండును, రుచికి సరిపడా ఉప్పును వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-వేయించి పెట్టుకున్న మిరపకాయలు, ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. మొదట నీరు పోయకుండా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత అవసరమైనంత తక్కువ నీరు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-చట్నీకి అసలైన ఘమఘమలను జోడించేది తాలింపే. ఇందుకోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి అందులో నువ్వుల నూనె వేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, ఒక ఎండు మిరపకాయ, తాజా కరివేపాకు వేసి చిటపటలాడించి వెంటనే ఆ తాలింపును చట్నీలో కలపండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన చెట్టినాడు స్పైసీ చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications