Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఆదివారం స్పెషల్..ఘాటైన మసాలాలతో నోరూరించే హైదరాబాదీ చికెన్..దేనిలోకైనా బెస్ట్ కాంబినేషన్
ఆదివారం వచ్చిందంటే చాలు, ప్రతి ఇంట్లో చికెన్ గుమగుమలు రావాల్సిందే. చికెన్ తో ఎన్ని రకాల వంటకాలు చేసినా హైదరాబాదీ చికెన్ రుచే వేరు. వేడి వేడి దోసె, చపాతీ, పరోటాలతో పాటు..బగారా రైస్ లేదా వైట్ రైస్ లోకి ఇది అద్భుతమైన కాంబినేషన్. దీనిని గ్రేవీలాగా లేదా స్టార్టర్ గా కూడా ఆస్వాదించవచ్చు. హైదరాబాదీ చికెన్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
చికెన్ - అర కిలో
గట్టి పెరుగు - 3 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
కారం పొడి - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - అర టేబుల్ స్పూన్
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - 1 టేబుల్ స్పూన్
పెద్ద ఉల్లిపాయలు - 2
నూనె - 3 చెంచాలు
నెయ్యి - 2 చెంచాలు
బిర్యానీ ఆకులు - 2
యాలకులు - 4
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
ధనియాలు/కొత్తిమీర గింజలు - అర చెంచా
పచ్చిమిర్చి - 5
కారం - 1 చెంచా
గరం మసాలా - 1 చెంచా
వేడి నీళ్లు - 1 కప్పు
కొత్తిమీర తరుగు - గార్నిష్ కోసం
తయారీ విధానం
-ముందుగా చికెన్ ముక్కలను బాగా కడిగి, నీరు ఏమీ లేకుండా వడకట్టి ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకోవాలి.
-చికెన్ ముక్కలలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు వేసి బాగా పట్టించాలి. ఈ మిశ్రమంపై మూత పెట్టి కనీసం అరగంట నుండి గంట పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు జ్యూసీగా తయారవుతాయి.
-స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె,నెయ్యి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు 2-3 నిమిషాల పాటు వేయించాలి. వేగిన ఉల్లిపాయలను తీసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే నూనెలో బిర్యానీ ఆకులు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు వేసి సువాసన వచ్చే వరకు కొన్ని సెకన్ల పాటు వేయించాలి.
-మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను పాన్ లో వేసి మీడియం మంటపై 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ఒక కప్పు వేడి నీళ్లు, ఒక చెంచా కారం, కొత్తిమీర, తగినంత ఉప్పు,ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి కలపాలి.
-మంటను సిమ్ లో పెట్టి మూత పెట్టి దాదాపు 20 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి, ఉప్పు సరిచూసుకోవాలి. చికెన్ మెత్తగా ఉడికే వరకు ఆగాలి.
-చికెన్ మెత్తబడిన తర్వాత, ఒక చెంచా గరం మసాలా, నిలువుగా కోసిన పచ్చిమిర్చి వేసి, మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన హైదరాబాదీ చికెన్ గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






