Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఆదివారం అదిరిపోయే రుచి..స్పైసీ నెల్లూరు చికెన్ రోస్ట్..ప్లేట్లు కూడా నాకేస్తారు!
ఆదివారం భోజనం అనగానే ముందుగా గుర్తొచ్చేది చికెన్. అయితే ప్రతి వారం వండే రొటీన్ చికెన్ కూరలు, ఫ్రైలు తిని మీకు బాగా బోర్ కొట్టిందా? పాత రుచులకు భిన్నంగా, కాస్త కొత్తగా, కారసారంగా ఏదైనా ట్రై చేయాలని ఉందా? అయితే ఈసారి నెల్లూరు స్పెషల్ చికెన్ రోస్ట్ ట్రై చేయండి.
నెల్లూరు వంటకాలు అనగానే వాటి ఘాటు, అద్భుతమైన రుచి మనకు ఇట్టే గుర్తుకొస్తాయి. ఇది నెయ్యి అన్నం (ఘీ రైస్), బిర్యానీ, పులావ్, చపాతీ లేదా రోటీల్లోకి అదిరిపోయే సైడ్ డిష్ గా ఉంటుంది.

నెల్లూరు చికెన్ రోస్ట్ తయారీకి కావలసిన పదార్థాలు
చికెన్ - అర కిలో
గట్టి పెరుగు - ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
కారం - ఒక టీస్పూన్
ధనియాల పొడి - ఒక టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
లవంగాలు - 4
యాలకులు - 2
కోడిగుడ్డు - 1
ఎండు మిరపకాయలు - 2
కరివేపాకు - ఒక గుప్పెడు
జీడిపప్పు - 15 పలుకులు
చిల్లీ సాస్ - 1 టేబుల్ స్పూన్
టొమాటో సాస్ - 2 టేబుల్ స్పూన్లు
వెనిగర్ - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
నెల్లూరు చికెన్ రోస్ట్ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో కడిగిన చికెన్ ముక్కలు తీసుకుని అందులో పెరుగు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి కనీసం అరగంట పాటు నానబెట్టుకోవాలి.
-తర్వాత నానబెట్టిన చికెన్ ను ఒక గిన్నెలో వేసి అందులో అర కప్పు నీళ్లు పోసి చికెన్ మెత్తగా ఉడికే వరకు సన్నని మంటపై ఉంచాలి.
-చికెన్ బాగా ఉడికిన తర్వాత నీటిని వడకట్టాలి. చికెన్ చల్లారాక, ఎముకల నుండి మాంసాన్ని వేరు చేసి (బోన్స్ తీసేసి) చిన్న చిన్న ముక్కలుగా విడదీసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేశాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి సువాసన వచ్చే వరకు వేయించాక ఎండు మిరపకాయలు వేసి అవి కాస్త రంగు మారాక, ముక్కలుగా చేసుకున్న చికెన్ ను అందులో వేసి కలపాలి.
-ఇప్పుడు చికెన్ మీద ఒక కోడిగుడ్డును పగలగొట్టి వేయాలి. గుడ్డు కాస్త ఉడికాక చికెన్ తో పాటు అంతా కలిసేలా బాగా ఫ్రై చేయాలి. తర్వాత గుప్పెడు కరివేపాకు, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసి చికెన్ ను దోరగా వేయించుకోవాలి.
-చివరగా అందులో టొమాటో సాస్, చిల్లీ సాస్, వెనిగర్ వేసి బాగా టాస్ చేస్తూ ఫ్రై చేయాలి. దించే ముందు పైన ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది.
-అంతే నోరూరించే నెల్లూరు స్పెషల్ చికెన్ రోస్ట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications