దోశ, రైస్, చపాతీలోకి కిర్రాక్ అనిపించే చికెన్ చాప్స్..ఈ ఆదివారం స్పెషల్ గా మారిపోతుంది

Posted By:

ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ ఘుమఘుమలు బజార్లలోకి వస్తుంటాయి. రోడ్డు మీద పోతున్నా కూడా చికెన్ వాసన వస్తూ వాసనకే సగం కడుపు నిండేలా ఉంటది. అయితే చికెన్ తో చాలామంది ఎప్పుడూ ఒకేరకమైన వంటకాలు చేస్తుంటారు. వాస్తవానికి చికెన్ తో బోలెడు వెరైటీ రెసిపిలు చేసుకోవచ్చు. అలాంటివాటిల్లో ఒకటి చికెన్ చాప్స్. దీని రుచి అద్భుతంగా ఉంటుంది.

చికెన్ చాప్స్.. దోశ, రైస్, చపాతీ, పరోటాలోకి ఎందులోకైనా అద్భుతంగా ఉంటుంది. సూపర్ టేస్టీ చికెన్ చాప్స్ మీ ఇంట్లో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Spicy and Juicy Chicken Chops Recipe in Telugu Best Side Dish for Rice Chapati and Dosa

చికెన్ చాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు

-500 గ్రాముల చికెన్
-1 పెద్ద ఉల్లిపాయలు
-2 టమాటోలు
-4 పచ్చిమిరపకాయలు
-1 ఇంచు అల్లం
-8 వెల్లుల్లి రెబ్బలు
-2 టేబుల్ స్పూన్ల ఆయిల్
-1 టీస్పూన్ సోంపు
-కరివేపాకు
-ఒకటిన్నర టీస్పూన్ ధనియాల పొడి
-1 టీస్పూన్ కారం పొడి
-1 టీస్పూన్ గరం మసాలా
-రుచికి సరిపడా ఉప్పు
-అర టీస్పూన్ మిరియాల పొడి
-కొత్తిమీర
-పుదీనా

ఆదివాసీ ఫిష్ ఫ్రై..గారెల్లా కరకరలాడుతూ భలే రుచిగా

చికెన్ చాప్స్ తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నూనె వేసి వేడి చేసి ఉల్లపాయ చీలికలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి సువాసన వచ్చేదాకా వేయించి స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి తీసి పక్కన పెట్టకోండి.

-తర్వాత మిక్సీ జార్ లో సపరేట్ గా టమాటోలు వేసి మెత్తని ప్యూరీలా చేసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో సోంపు గింజలు, కరివేపాకు వేసి వేయించాక అందులో గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.

-ఉల్లిపాయ పేస్ట్ వేగాక అందులో టమాటో ప్యూరీ, ఉప్పు వేసి కలిపి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కలుపుకోవాలి.

-ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులె చికెన్ ముక్కలు, ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. దీనిపై మూతపెట్టి 15-20 నిమిషాలు చికెన్ ఉడికి, మసాలా చిక్కబడేవరకు కలుపుకోవాలి.

-చివరగా అందులో మిరియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకొని స్టవ్ ఆపేయండి.

-అంతే చికెన్ చాప్స్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, October 24, 2026, 22:35 [IST]
Desktop Bottom Promotion