Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ఆంధ్రా స్టైల్ టమాటో కొత్తిమీర పచ్చడి..వేడి వేడి అన్నంలో నెయ్యి, ఈ పచ్చడి ఉంటే అమృతమే!
తెలుగు వంటకాల్లో పచ్చడి అనేది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, ఘాటైన పచ్చడి కలుపుకొని తింటే ఆ తృప్తే వేరు. అలాంటి పచ్చళ్ళలో అత్యంత ప్రజాదరణ పొందినది, సులభంగా తయారు చేసుకోగలిగినది టమాటో కొత్తిమీర పచ్చడి.
పుల్లని టమాటోలు, సువాసన వెదజల్లే కొత్తిమీర కలయికతో తయారయ్యే ఈ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. టమాటో కొత్తిమీర పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
టమాటోలు: 400 గ్రాములు
కొత్తిమీర: 1 పెద్ద కట్ట
పల్లీలు: 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి: 12
ఎండుమిర్చి: 2
చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు
వెల్లుల్లి రెబ్బలు: 7
జీలకర్ర: అర టీస్పూన్
ఆవాలు: అర టీస్పూన్
ఇంగువ: చిటికెడు
నూనె: 5 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: పావు టీస్పూన్
కరివేపాకు: కొద్దిగా
మినపప్పు: అర టీస్పూన్
పచ్చి శనగపప్పు: అర టీస్పూన్
ధనియాలు: కొంచెం
తయారీ విధానం
-స్టవ్ మీద పాన్ పెట్టవి అందులో 5టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి ఇందులో పల్లీలు వేసి చిట్లనిచ్చిన తర్వాత అందులో ధనియాలు,జీలకర్ర,పచ్చిమిర్చి వేసి వేయించాలి.
-పచ్చిమిర్చి మెత్తబడిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి,ఇందులోనే చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి
-తర్వాత స్టవ్ మీద పాన్ లో కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక అందులో నాటు టమాటోల పెద్ద ముక్కలు వేసి కలిపి మూతపెట్టి టమాటో ముక్కలపై తోలు ఊడే వరకు వేయించాలి.
-తర్వాత మూత తీసి అందులో పెద్ద పిడికెడు కొత్తిమీర కాడలతో సహా వేసి జస్ట్ మగ్గనిచ్చి స్టవ్ ఆపేయాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో టమాటో కొత్తిమీర మిశ్రమం వేసి జస్ట్ 2-3 సార్లు బర్రుమనిపించండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో కొంచెం నూనె వేడిచేశాక ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చి శెనగపప్పు, ఎండుమిరపకాయల ముక్కలు, వెల్లుల్లి వేసి వేగాక ఇందులో కరివేపాకు,పసుపు,ఇంగువ కూడా వేసి వేయించి స్టవ్ ఆపేయాలి.
-ఇప్పుడు వేయించిన తాలింపులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి మొత్తం కలిసేలా కలుపుకొని అరగంటసేపు చల్లారనివ్వాలి. తర్వాత అన్నంలో కలుపుకొని తింటే స్వర్గమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications