Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
చపాతీ, అన్నంలోకి ఆల్ రౌండర్ టమాటా తొక్కు..రుచి చూస్తే వదలరు!
రోజూ చేసుకునే చట్నీలు, కూరలకు భిన్నంగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి వీలుగా, నోరూరించేలా ఉండే ఒక అద్భుతమైన వంటకం టమాటా తొక్కు. ఇది కేవలం అల్పాహారంలోకే కాదు, వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నా స్వర్గం కనిపిస్తుంది.
అతి తక్కువ పదార్థాలతో, చాలా సులభంగా తయారు చేసుకోగల ఈ టమాటా తొక్కు మీ భోజనం రుచిని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. టమాటా తొక్కు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
పండిన టమాటాలు - 1 కిలో
నువ్వుల నూనె- అర కప్పు
ఎండు మిరపకాయలు - 15
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
మెంతులు -అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 10- 12
చింతపండు - చిన్న నిమ్మకాయంత
నల్ల మిరియాలు - 10
ఆవాలు - 1 టీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
కరివేపాకు - రెండు రెబ్బలు
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ పై ఒక పాన్ పెట్టి నూనె లేకుండా జీలకర్ర, మెంతులు, ఎండు మిరపకాయలు, నల్ల మిరియాలు వేసి చిన్న మంట మీద మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించి స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించి చల్లార్చినవి,వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ మసాలా పొడే టమాటా తొక్కుకు అసలైన రుచిని ఇస్తుంది.
-ఇప్పుడు టమాటాలను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కోసి మిక్సీ జార్ లో వేసుకోవాలి. దీనికి శుభ్రం చేసుకున్న చింతపండును కూడా జోడించి మెత్తని ప్యూరీలా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ పై మందపాటి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ఇంగువ, కరివేపాకు వేసి వేయించాక సిద్ధం చేసుకున్న టమాటా-చింతపండు ప్యూరీని వేసి, రుచికి సరిపడా ఉప్పు కూడా కలపాలి.
-మీడియం మంట మీద ఉంచి మూత పెట్టి ఉడికించాలి. టమాటాలోని పచ్చి వాసన పోయి, మిశ్రమం దగ్గరపడే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
-10-15 నిమిషాల తర్వాత టమాటా మిశ్రమం నుండి నూనె పైకి తేలడం
ప్రారంభమవుతుంది.
ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలపాలి.
ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి, మరో 5-7 నిమిషాల పాటు
ఉడికించాలి.
-తొక్కు చిక్కబడి, పాన్ అంచులను వదిలి, నూనె పూర్తిగా పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఘుమఘుమలాడే, ఎంతో రుచికరమైన టమాటా తొక్కు రెడీ.
-ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications