Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చలి పుట్టించే వణుకులో..వేడి పుట్టించే ముంబై స్టైల్ చికెన్ ఘోటాలా..ఎలా చేసుకోవాలంటే..
చలికాలం వచ్చిందంటే చాలు..మనసు వేడి వేడిగా, ఘాటుగా ఉండే ఆహారాన్ని కోరుకుంటుంది. బయట చల్లటి గాలులు వీస్తుంటే ప్లేటులో వేడి వేడి ఆహారం ఉంటే ఆ మజానే వేరు. ముఖ్యంగా మాంసాహార ప్రియులైతే చికెన్ తో ప్రయోగాలు చేయడానికి ఇదే సరైన సమయం.
సాధారణంగా మనం చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ లేదా చికెన్ బిర్యానీ వంటివి ఎక్కువగా తింటూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా చికెన్ ఘోటాలా గురించి విన్నారా? ఒక్కసారి ఈ చికెన్ ఘోటాలాను రుచి చూస్తే, రెగ్యులర్ చికెన్ వంటకాలను మర్చిపోవడం ఖాయం. మరీ ముఖ్యంగా చపాతీలు, పరాఠాలు లేదా పావ్ బ్రెడ్ తో ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ స్పెషల్ డిష్ ను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావలసిన పదార్థాలు
-ఉల్లిపాయలు
-పచ్చిమిర్చి
-బోన్ లెస్ చికెన్
-తాజా పెరుగు
-నూనె
-ఉప్పు
-కారం
-పసుపు
-ధనియాల పొడి
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-అల్లం
తయారీ విధానం
-ముందుగా ఎముకలు లేని చికెన్ ని తీసుకుని శుభ్రం చేసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 1-2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి అడుగు ఉన్న పాన్ పెట్టి, అందులో తగినంత నూనె వేయండి. నూనె వేడెక్కాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి.
-ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి మారగానే అందులో ఒక కప్పు తాజా పెరుగు వేయాలి. వెంటనే అందులో చిటికెడు పసుపు, మీ రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై ఉడికించాలి.
-మసాలా మిశ్రమం బాగా ఉడికిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న చికెన్ ముక్కలను అందులో వేయాలి. మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలిపి, మూత పెట్టండి. సుమారు 20 నిమిషాల పాటు సన్నని మంటపై చికెన్ ను బాగా ఉడకనివ్వాలి.
-చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు గరిటతో గానీ లేదా పప్పు గుత్తితో గానీ ఉడికిన చికెన్ ను బాగా మెత్తగా మెదపాలి. చికెన్ ముక్కలు కీమాలాగా విడిపోయేలా చేసుకోవాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమానికి మరింత రుచిని జోడించడానికి మరోసారి తాలింపు పెట్టాలి. దీనికోసం మరో 3-4 ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్కను తీసుకుని చాలా సన్నగా, మెత్తగా కట్ చేసుకోవాలి.
-వేరే పాన్‌లో కొంచెం నూనె వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక కొద్దిగా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
-ఇప్పుడు ఈ తాలింపులో ముందుగా మెదిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. మరో 10-15 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. చివరగా కసూరి మేథిని నలిపి పైన చల్లుకోవాలి. అంతే వేడి వేడి చికెన్ ఘోటాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications