Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వంట రాని వారు కూడా చిటికెలో చేసే సూపర్ టేస్టీ స్నాక్.. ఆలూ కట్లీ చేసుకోండిలా..
సాయంత్రం కాగానే వేడి వేడి టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలనిపించడం సహజం. బజ్జీలు, పకోడీలు, సమోసాలు ఎప్పుడూ తినేవే. బంగాళదుంపలతో ఎన్నో రకాల వెరైటీలు రుచి చూసే ఉంటారు. కానీ ఎప్పుడైనా స్పైసీగా, ఎంతో క్రంచీగా ఉండే ఆలూ కట్లీని ట్రై చేశారా? పేరు వినడానికే కాదు, తినడానికి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. వంట రాని వారు కూడా చిటికెలో తయారు చేయగల అతి సులభమైన, అత్యంత రుచికరమైన రెసిపీ ఇది. ఈ వర్షాకాలం లేదా చలికాలం సాయంత్రాల్లో వేడి వేడి ఛాయ్ తాగుతూ ఈ ఆలూ కట్లీని ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు.

ఆలూ కట్లీ తయారీకి కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు - 500 గ్రాములు
బియ్యప్పిండి - 2 టీస్పూన్లు
ఆవ నూనె - తగినంత
ఇంగువ - ఒక చిటికెడు
జీలకర్ర - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 4 లేదా 5
ధనియాల పొడి - 1 టీస్పూన్
కారం పొడి - 1 టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
బ్లాక్ సాల్ట్ - అర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
పుదీనా పొడి - అర టీస్పూన్
ఆలూ కట్లీ తయారీ విధానం
-ముందుగా బంగాళదుంపల పైన తొక్క తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి. బంగాళదుంపలన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోండి. వీటిని మరీ మందంగా కాకుండా, అలాగని మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో గుండ్రంగా చక్రాల్లా కోసుకోవాలి. అవసరమైతే స్లైసర్ ను కూడా వాడొచ్చు. కోసిన ముక్కలను రెండు మూడు సార్లు నీళ్లలో బాగా కడగాలి.
-నీళ్లలో కడిగిన బంగాళదుంప స్లైసెస్ను ఒక చిల్లుల గిన్నె లేదా జల్లెడలో వేసి నీరంతా వంపేయాలి. ముక్కలు కొద్దిగా తడిగా ఉన్నా వేయించేటప్పుడు బాణలికి అతుక్కుపోతాయి. కాబట్టి, ఒక పొడి కాటన్ క్లాత్ పైన ఈ ముక్కలను పరిచి, వాటిలోని తేమ పూర్తిగా పోయేలా బాగా ఆరబెట్టుకోవాలి.
-ముక్కలు పూర్తిగా ఆరిన తర్వాత 2 టీస్పూన్ల బియ్యప్పిండిని చల్లి బాగా పట్టించాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక మందపాటి బాండీలో ఆవనూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక చిటికెడు ఇంగువ, ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత బియ్యప్పిండి పట్టించిన ఆలూ స్లైసెస్ ను వేసి వేయించాలి. ముక్కలు విరగకుండా మెల్లగా కలుపుతూ ఉండాలి. కొద్దిగా పసుపు వేసి, పాన్ కి అంటుకోకుండా కలుపుతూ, మూత పెట్టి బంగాళదుంపలు బాగా మగ్గనివ్వాలి.
-ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కారం, చిల్లీ ఫ్లేక్స్, నల్ల ఉప్పు, గరం మసాలా, పుదీనా పొడి వేసి బాగా కలపాలి. మసాలాల ఘుమఘుమలు ముక్కలకు పట్టేలా మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే నోరూరించే, స్పైసీ అండ్ క్రిస్పీ ఆలూ కట్లీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications