Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
వేడిని తగ్గించే కీర దోసకాయతో.. నోరూరించే కొరియన్ కిమ్చి..ఈజీగా చేసేయండిలా..
ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కొరియన్ ట్రెండ్ నడుస్తోంది. కొరియన్ డ్రామాలు, మ్యూజిక్ మాత్రమే కాదు.. కొరియన్ వంటకాలు కూడా మన భారతీయులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.. కొరియన్ వంటకాల్లో వాడే ఘాటైన మసాలాలు, కారం మన ఇండియన్ వంటల రుచులకు దగ్గరగా ఉంటాయి. అందుకే వాటిని ఇష్టపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మీరు కూడా ట్రెండీగా, కారంగా, ఆరోగ్యకరంగా ఉండే ఏదైనా కొత్త వంటకాన్ని రుచి చూడాలనుకుంటున్నారా? అయితే కొరియన్ స్టైల్ దోసకాయ కిమ్చిని ట్రై చేయాల్సిందే.

సాధారణంగా కిమ్చి అనేది కొరియా దేశపు సాంప్రదాయక వంటకం. కూరగాయలకు వివిధ రకాల సాస్ లు, మసాలాలు పట్టించి పులియబెట్టి దీనిని తయారు చేస్తారు. అయితే పచ్చి దోసకాయలతో చేసే కిమ్చిని కొరియన్ భాషలో ఓయ్ కిమ్చి అని పిలుస్తారు. తాజా దోసకాయల క్రంచీనెస్, మసాలాల ఘాటు కలగలిపి ఇది అద్భుతమైన రుచిని ఇస్తుంది.
దోసకాయ కిమ్చి తయారీకి కావలసిన పదార్థాలు
కీర దోసకాయలు - 4 లేదా 5
ఉప్పు - 1 టీస్పూన్
ఎర్ర కారం పొడి - 1 టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన వెల్లుల్లి - 1 టీస్పూన్
తురిమిన అల్లం - 1 టీస్పూన్
సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్
వెనిగర్ లేదా నిమ్మరసం - 1 టీస్పూన్
తేనె లేదా చక్కెర - 1 టీస్పూన్
స్ప్రింగ్ ఆనియన్- కొద్దిగా
వేయించిన తెల్ల నువ్వులు - 1 టీస్పూన్

దోసకాయ కిమ్చి తయారీ విధానం
-ముందుగా దోసకాయలను శుభ్రంగా కడిగి, మీ ఇష్టాన్ని బట్టి గుండ్రంగా లేదా పొడవుగా ముక్కలుగా కోసుకోవాలి. మరీ సన్నగా కాకుండా కాస్త మందంగా కోసుకుంటే తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి.
-ఇప్పుడు ఆ దోసకాయ ముక్కలకు కొద్దిగా ఉప్పు పట్టించి సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల దోసకాయల్లోని అదనపు నీరు బయటకు వచ్చేస్తుంది. ఆ నీటిని పారబోయాలి.
-ఒక గిన్నె తీసుకుని అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, తురిమిన అల్లం, కారం, సోయా సాస్, వెనిగర్, తేనె వేసి మసాలా పేస్ట్ లా బాగా కలుపుకోవాలి.
-నీరు తీసేసిన దోసకాయ ముక్కలను ఈ మసాలా మిశ్రమంలో వేసి, ప్రతి ముక్కకు మసాలా బాగా పట్టేలా చేత్తో మెల్లగా కలపాలి. ఆ తర్వాత తరిగిన పచ్చి ఉల్లిపాయ వేసి మరోసారి కలపాలి.
-కిమ్చికి అసలైన అందం, రుచి తెల్ల నువ్వుల ద్వారానే వస్తుంది. కాబట్టి చివరగా వేయించిన తెల్ల నువ్వులను పైన చల్లుకుంటే ఎంతో రుచికరమైన కొరియన్ దోసకాయ కిమ్చి రెడీ.
-ఈ దోసకాయ కిమ్చిని తయారు చేసిన వెంటనే ఫ్రెష్ గా తినవచ్చు లేదా ఒక గాలి చొరబడని డబ్బాలో పెట్టి గంట లేదా రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి చల్లగా కూడా వడ్డించవచ్చు. రైస్, నూడుల్స్ తో సైడ్ డిష్ గా లేదా సాయంత్రం స్నాక్ గా కూడా ఇది అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications