Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గుంటూరు స్టైల్ స్పైసీ చికెన్ రోస్ట్..ఎలా చేసుకోవాలో చూడండి
స్పైసీ వంటకాలకు గుంటూరు పెట్టింది పేరు. ఏపీలోని గుంటూరు పేరు వింటేనే చాలామందికి అక్కడి స్పైసీ వంటకాలు గుర్తుకొచ్చి నోట్లో లాలాజలం ఊరిపోతుంది. గుంటూరు స్పెషల్ చికెన్ రోస్ట్ తినాలంటే పెట్టి పుట్టాల్సిందేనని అక్కడి వాళ్లు చెబుతుంటారు. కారం,మసాలాల కలయికతో చాలా రుచికరంగా ఉంటుంది. గుంటూరు చికెన్ రోస్ట్ ప్రత్యేకత దాని కారంలో ఉంటుంది.
ఈ వంటకంలో గుంటూరు ప్రాంతానికి చెందిన ప్రత్యేకమైన కారం పొడిని ఉపయోగిస్తుంటారు. ఈ మిర్చి చాలా కారంగా ఉండి వంటకానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. గుంటూరు స్టైల్ చికెన్ రోస్ట్ ని ఇంట్లోనే తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

గుంటూరు చికెన్ రోస్ట్ తయారీకి కావలసిన
పదార్థాలు
-చికెన్- 1 కేజీ
-ఉల్లిపాయలు- 2
-పచ్చిమిర్చి- 4
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
-టొమాటోలు - 2
-కారం పొడి- 2 టేబుల్ స్పూన్లు
-ధనియాల పొడి- 1 టేబుల్ స్పూన్
-జీలకర్ర పొడి- 1 టీస్పూన్
-గరం మసాలా- 1/2 టీస్పూన్
-పసుపు- 1/2 టీస్పూన్
-ఉప్పు
-నూనె
-కొత్తిమీర
గుంటూరు చికెన్ రోస్ట్ తయారీ విధానం
- చికెన్‌ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్
చేసుకోవాలి.
-ఒక గిన్నెలో చిర్నగా కట్ చేసిన చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
-ఒక పాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
-పచ్చిమిర్చి చీలికలు వేసి కాసేపు వేయించాలి.
-నానబెట్టిన చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి.
-టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించిన తర్వాత అందులో గరం మసాలా వేసి కలపాలి. ఈ వంటకంలో మీరు కొంచెం పెరుగు కూడా వేయవచ్చు.
-చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications