Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఆంధ్రా స్టైల్ కరివేపాకు కోడిగుడ్డు వేపుడు..నాలుక నాట్యమాడాల్సిందే!
భారతీయ వంటకాల్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సుగంధ ద్రవ్యాలకు, ఆకుకూరలకు ప్రత్యేక స్థానం ఉంది. మనం సాధారణంగా కూరల్లో కరివేపాకును కేవలం సువాసన కోసం వాడి, తినేటప్పుడు పక్కన పెట్టేస్తుంటాము. కానీ కరివేపాకును ప్రధాన పదార్థంగా చేసుకుని వండే వంటకాలు రుచితో పాటు ఎన్నో ఔషధ గుణాలను మన శరీరానికి అందిస్తాయి.
అలాంటి ఒక అద్భుతమైన వంటకమే కరివేపాకు కోడిగుడ్డు వేపుడు. కోడిగుడ్డులోని ప్రోటీన్, కరివేపాకులోని ఐరన్, విటమిన్ల కలయిక ఈ వంటకాన్ని ఒక సూపర్ ఫుడ్ గా మారుస్తుంది. ఈ కరివేపాకు గుడ్డు వేపుడు ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-ధనియాలు
-లవంగాలు
-దాల్చిన చెక్క
-కోడిగుడ్లు
-గసగసాలు
-ఎండుకొబ్బరి పొడి
-వెల్లుల్లి రెబ్బలు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-జీలకర్ర
-కరివేపాకు
-ఉల్లిపాయ తరుగు
-ఆయిల్
-రాతిపువ్వు
-ఎండుమిర్చి
-పచ్చిమిర్చి
-వెల్లుల్లి
-ఉప్పు
-పసుపు
-కారం
-ఆవాలు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో గుడ్లు వేసి నీరు పోయండి. అందులోనే కొంచెం ఉప్పు, రసం పిండేసిన నిమ్మకాయ డొప్ప వేసి గుడ్డను ఉడకనివ్వండి.
-గుడ్లు ఉడికేలోగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4 లవంగాలు, రెండున్నర ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకలు, కొంచెం రాతిపువ్వు, 5 ఎండుమిరపకాయలు, 15 వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాలి.జస్ట్ మసాలాలు వెచ్చబడితే చాలు.అప్పుడు అందులో 1 టీస్పూన్ గసగసాలు, 2 చెంచాల ఎండు కొబ్బరి పొడి లేదా తురుము వేసి స్టవ్ ఆపేయండి. ఆ సెగకే ఎండుకొబ్బరి వేగిపోతుంది.
-వేగిన మిశ్రమం మొత్తాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లోనే 1 కప్పు కరివేపాకు వేసి సన్నని సెగ మీద ఆకులోని చెమ్మ ఆరేంతవరకు వేపి స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించిన కరివేపాకు,మసాలాల మిశ్రమం మొత్తం వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 7-8 చెంచాల ఆయిల్ పోసి వేడి చెయ్యండి. ఆయిల్ వేడయ్యాక అందులో ఉడికించుకున్న గడ్లను పొట్టు తీసి గాట్లు పెట్టి పాన్ లో వేయాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసి గుడ్లను పైపైన వేపుకున్నాక గుడ్లను ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు పాన్ లో ఉన్న ఆయిల్ లోనే 1 టీస్పూన్ ఆవాలు వేసి చిట్లనివ్వాలి. తర్వాత అందులో 1 కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు, 1 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లి ముక్కలు మెత్తబడేవరకు వేపుకోండి. అప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి.
-ఇప్పుడు వేయించుకున్న గుడ్లను పొడవాటి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 1 టీస్పూన్ కారం వేసి కలుపుకోండి.తర్వాత గ్రైండ్ చేసుకున్రన మసాలా పొడి, ఉప్పు, గుడ్ల ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి 30 సెకన్ల పాటు పెద్ద మంట మీద వేగనిచ్చి స్టవ్ ఆపేయండి. అంతే కరివేపాకు కోడిగుడ్డు వేపుడు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications