Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
రెస్టారెంట్ స్టైల్ పెప్పర్ చికెన్ ఇంట్లోనే..ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
ప్రతి వారం చేసుకునే రొటీన్ చికెన్ కూర లేదా చికెన్ ఫ్రై తిని మీకు బోర్ కొట్టిందా? ఈసారి మీ కుటుంబ సభ్యులకు కొత్తగా ఏదైనా రుచి చూపించాలనుకుంటున్నారా? అయితే ఆంధ్రా స్టైల్ పెప్పర్ చికెన్ ను ట్రై చేయండి. మిరియాల ఘాటుతో, నోరూరించే మసాలాలతో ఉండే పెప్పర్ చికెన్ ..బిర్యానీలోకే కాదు.. వేడి వేడి అన్నం, చపాతీ, దోస లేదా పూరీల్లోకి కూడా అద్భుతమైన కాంబినేషన్.
ఇందులో మనం వాడే ఒక సీక్రెట్ ఇంగ్రిడియంట్ వల్ల దీనికి అచ్చం రెస్టారెంట్లో దొరికే స్టార్టర్ రుచి వస్తుంది. రుచికరమైన ఆంధ్రా స్టైల్ పెప్పర్ చికెన్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బోన్ లెస్ చికెన్: అర కిలో
ఉల్లిపాయలు: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి: 3 టేబుల్ స్పూన్లు
సోయా సాస్: 1 టేబుల్ స్పూన్
అల్లం ముక్కలు: అర అంగుళం
వెల్లుల్లి రెబ్బలు: 5
పచ్చిమిర్చి: 3
పసుపు: అర స్పూన్
గరం మసాలా: అర స్పూన్
ధనియాల పొడి:1 స్పూన్
సోంపు పొడి: 1 స్పూన్
కారం: 1 స్పూన్
కరివేపాకు: కొద్దిగా
కొత్తిమీర: కొద్దిగా
ఉప్పు: సరిపడా
నూనె: తగినంత
తయారీ విధానం
-ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి నీరు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ ముక్కలకు తగినంత ఉప్పు, పసుపు, ఒక చెంచా మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పట్టించాలి. మసాలా ముక్కలకు బాగా పట్టేలా కలిపి కనీసం అరగంట పాటు పక్కన పెట్టండి.
-స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి అర నిమిషం వేయించండి. ఆ తర్వాత తాజా కరివేపాకు రెబ్బలు వేసి చిటపటలాడించి, వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
-ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారి మెత్తబడే వరకు వేయించండి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, సోంపు పొడి, గరం మసాలా, కారం వేసి వేయించాలి. మసాలాలు మాడిపోకుండా కొద్దిగా నీళ్లు చల్లి, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
-ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను పాన్ లో వేసి, మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఉప్పు సరిచూసుకుని, పాన్ మీద మూత పెట్టి మీడియం మంటపై 5 నుంచి 8 నిమిషాలు ఉడికించాలి. చికెన్ లోని నీరు బయటకు వచ్చి ముక్క మెత్తబడుతుంది. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
-ఇప్పుడు మూత తీసి, మంటను హై ఫ్లేమ్ లో పెట్టి చికెన్ లోని నీరంతా ఆవిరైపోయేలా వేయించాలి. కూర దగ్గర పడుతున్నప్పుడు, అసలైన రుచి కోసం 1 స్పూన్ సోయా సాస్, మిగిలిన మిరియాల పొడిని చికెన్ పై చల్లాలి.
-ముక్కలు బాగా వేగి, నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆపేయండి. చివరగా గుప్పెడు కరివేపాకు లేదా కొత్తిమీర చల్లుకుంటే, ఘాటైన ఆంధ్రా స్టైల్ పెప్పర్ చికెన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












