Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముక్క ముక్కలో మజా.. నోరూరించే చికిరి చికెన్ ఎలా చేయాలో చూడండి
ఎప్పుడూ బోరింగ్ గా చేసుకునే చికెన్ కర్రీలు ఏం తింటారు..ఓ సారి చికిరి చికెన్ ట్రై చేయండి. ప్రత్యేకమైన, నోరూరించే వంటకాల్లో చికిరి చికెన్ ఒకటి. రోటీలు, చపాతీలు, బగారా రైస్ లేదా వైట్ రైస్‌లోకి ఇది అద్భుతమైన కాంబినేషన్. చికిరి చికెన్ కేవలం రుచికరమైనదే కాదు, దీనిలో వాడే పదార్థాలు, చికెన్ ద్వారా మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పసుపు
-కారం
-ఉప్పు
-చికెన్
-ఆయిల్
-పెరుగు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ఉల్లిపాయ
-పచ్చిమిరపకాయ
-కొత్తిమీర
-ఆయిల్
-నిమ్మరసం
-గరం మసాలా
-కసూరి మేథీ

తయారీ విధానం
-ముందుగా అర కేజీ చికెన్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని శుభ్రంగా కడిగాలి.
-ఇప్పుడు ఓ గిన్నెలో రుచికి తగిన ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం,1 టీస్పూన్ గరం మసాలా, 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టీస్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి అందులో చికెన్ ముక్కలను వేసి 2 నిమిషాలు వేయించాక మూతపెట్టి 10-12 నిమిషాలు మీడియం, తక్కువ మంట మీద ఉడకనివ్వాలి.
-తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ చీలికలు, 2 పచ్చిమిరపకాయల ముక్కలు వేసి 2 నిమిషాలు వేపుకొని మూతపెట్టి తక్కువ మంట మీద 3 నిమిషాలు మగ్గనివ్వాలి.
-తర్వాత మూత తీసి మళ్లీ 2 నిమిషాలు వేయించుకొని అందులో కొత్తిమీర చల్లుకొని కలిపి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక గిన్నెలో గడ్డ పెరుగు 1 కప్పు(250ml) వేసి చిక్కగా చిలుకుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో తాలింపుకి తగినంత ఆయిల్ పోసి వేడి చేశాక అందులో పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ కసూరి మేథీ వేసి వేడి చేసి దీనిని పెరుగులో వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమం మొత్తాన్ని చికెన్ మీద పోసి బాగా కలిపి చివర్లో కొంచెం కొత్తిమీర చల్లుకోండి. అంతే చికిరి చికెన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications