Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఒక్కసారి రుచి చూస్తే వదలని స్పైసీ టమాటా ఆమ్లెట్..వేడి వేడి అన్నంలో తింటే ఆ మజానే వేరు!
గుడ్డుతో ఎప్పుడూ రొటీన్ ఆమ్లెట్ తిని విసిగిపోయారా? అయితే ఈసారి సరికొత్తగా స్పైసీ టమాటా ఆమ్లెట్ ట్రై చేయండి. టమాటాల పులుపు, మసాలాల ఘాటు, గుడ్డు రుచి అన్నీ కలిపి దీనిని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
వేడి వేడి అన్నంలోకి సైడ్ డిష్ గా లేదా సాయంత్రం పూట ఒక హెల్దీ స్నాక్ గా ఇది అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి, ఒక్క ముక్క తిన్నా సరే మీ కడుపు నిండిపోతుంది. నోరూరించే టమాటా ఆమ్లెట్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
గుడ్లు: 3
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ: 1
టమోటాలు: 2
పచ్చిమిర్చి: 1
కరివేపాకు: 1 రెమ్మ
కొత్తిమీర: కొద్దిగా
మిరియాల పొడి: 1 టేబుల్ స్పూన్
కారం: 1 టీస్పూన్
గరం మసాలా: 1 టీస్పూన్
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాన్ పెట్టుకోండి. అందులో రెండు చెంచాల నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కాక మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించండి.
-ఉల్లిపాయలు పచ్చి వాసన పోయి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగుతుండగానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపండి. కరివేపాకు, కొత్తిమీర నూనెలో వేగడం వల్ల ఆమ్లెట్ కు మంచి సువాసన వస్తుంది.
-ఇప్పుడు సన్నగా తరిగిన టమోటా ముక్కలను పాన్ లో వేయండి. మంటను మధ్యస్థంగా ఉంచి, టమోటా ముక్కలు పూర్తిగా మెత్తబడి గుజ్జులా అయ్యేవరకు వేయించాలి. టమోటా ఎంత బాగా మగ్గితే ఆమ్లెట్ అంత జ్యూసీగా వస్తుంది.
-టమోటా మెత్తబడిన తర్వాత, అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, చిటికెడు పసుపు, గరం మసాలా వేసి బాగా కలపండి. ఈ మసాలాలన్నీ నూనెలో వేగి పచ్చి వాసన పోయేలా ఒకటి రెండు నిమిషాలు వేయించాలి.
-మసాలా మాడిపోకుండా ఉండటానికి, ఆమ్లెట్ జ్యూసీగా రావడానికి, మిశ్రమంలో చాలా కొద్దిగా నీరు పోసి మరిగించండి. నీరు ఆవిరైపోయి దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టండి.
-ఈలోపు ఒక గిన్నెలో 3 గుడ్లను పగలగొట్టి, బాగా గిలకొట్టండి. గుడ్లను ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది.
-ఇప్పుడు గిలకొట్టిన గుడ్డు మిశ్రమాన్ని పాన్ లోని టమాటా మసాలాలో పోయండి. గరిటెతో నెమ్మదిగా కలుపుతూ, మసాలా అంతా గుడ్డుకు పట్టేలా చూసుకోండి. లేదా మసాలాను పాన్ అంతా పరచి దానిపై గుడ్డు మిశ్రమాన్ని పోసి ఆమ్లెట్ లాగా సెట్ అవ్వనివ్వచ్చు.
-ఆమ్లెట్ ఒక వైపు బాగా కాలాక, జాగ్రత్తగా రెండో వైపుకు తిప్పండి. రెండు వైపులా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోండి.
-అంతే వేడి వేడి, స్పైసీ టమాటా ఆమ్లెట్ రెడీ. దీనిపై కొంచెం కొత్తిమీర చల్లుకుని తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications