Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పాలు విరిగిపోయాయా? డోంట్ వర్రీ.. ఇలా నోట్లో కరిగిపోయే కలాకండ్ బర్ఫీ చేసేయండి!
పాలు విరిగిపోగానే అరెరె పాలు పాడైపోయాయే అని బాధపడుతూ, వాటిని పనికిరావని పారబోస్తుంటాం. మహా అయితే ఆ విరిగిన పాలతో పనీర్ చేసుకుంటాం. అయితే విరిగిన పాలతో మీ ఇంట్లోనే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే అద్భుతమైన స్వీట్ తయారు చేయవచ్చని మీకు తెలుసా? అదే కలాకండ్ బర్ఫీ.
బయట స్వీట్ షాపుల్లో ఎంతో ఖరీదు పెట్టి కొనే కలాకండ్ బర్ఫీని మనం ఇంట్లోనే చాలా సులభంగా చేయవచ్చు. పూస పూసగా ఉండే దీని ఆకృతి, కమ్మని రుచి, తేలికపాటి తీపి ప్రతి ఒక్కరి మనసును దోచేస్తాయి. విరిగిన పాలతో కలాకండ్ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
విరిగిన పాలు - 1 లీటరు
చక్కెర - 1 కప్పు
నీళ్లు - అర కప్పు
యాలకుల పొడి - పావు టీస్పూన్
డ్రై ఫ్రూట్స్ - బాదం, జీడిపప్పు, పిస్తా
తయారీ విధానం
-ముందుగా మీ దగ్గర విరిగిపోయిన పాలు ఉంటే వాటిని ఒక శుభ్రమైన పల్చటి కాటన్ వస్త్రంలో వేసి గట్టిగా పిండాలి. అందులో ఉన్న నీరంతా పోయి, కేవలం ముద్ద (దీనినే చెన్నా అంటారు) మాత్రమే మిగిలేలా చూసుకోవాలి.
-ఒకవేళ మీరు మామూలు పాలతోనే దీన్ని చేయాలనుకుంటే, 1 లీటరు పాలను మరిగించండి. పాలు పొంగుతున్నప్పుడు అందులో రెండు లేదా మూడు చెంచాల నిమ్మరసం కానీ, వెనిగర్ కానీ వేయండి. పాలు విరిగిపోయి చెన్నా, నీరు వేరుపడతాయి. వెంటనే స్టవ్ ఆపేసి ఆ ముద్దను వస్త్రంలో వేసి వడకట్టండి. నిమ్మకాయ పులుపు వాసన పోవడానికి ఆ ముద్దను చల్లటి నీటితో రెండుసార్లు కడిగి, నీరంతా పోయేలా గట్టిగా పిండుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, అడుగు మందంగా ఉన్న ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ (చెన్నా) ముద్దను వేసి సన్నని మంటపై ఉడికించాలి. అందులో ఉన్న తడి అంతా ఆవిరైపోయేలా కలుపుతూ ఉండాలి. అదే సమయంలో అందులో చక్కెర, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. చక్కెర అంతా కరిగి, పాకంలా మారి చెన్నాకు పడుతుంది. మిశ్రమం దగ్గరపడి, కొద్దిగా గోధుమ రంగులోకి మారుతున్నప్పుడు సువాసన కోసం యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ లేదా ట్రే తీసుకుని, దానికి కొద్దిగా నెయ్యి రాసి, ఉడికించిన కలాకండ్ మిశ్రమాన్ని అందులో సమానంగా (చదరంగా) పరచాలి. దాని పైన సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులను చల్లి, గరిటెతో మెల్లగా అదమాలి. ఈ ట్రేను సుమారు ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచండి.
-గంట తర్వాత బయటకు తీసి, చాకుతో మీకు నచ్చిన ఆకారంలో బర్ఫీల్లా కట్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన, కమ్మని కలాకండ్ బర్ఫీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications