Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
శ్రీకాకుళం స్పెషల్ టమాటో ఆమ్లెట్..తాతమ్మల కాలం నాటి రెసిపి,ఎలా చేయాలంటే
శ్రీకాకుళం పేరు వినగానే చాలామందికి అక్కడి ప్రజల యాస, వారి ఆప్యాయతలు, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం గుర్తుకొస్తాయి. అయితే శ్రీకాకుళంలో ప్రత్యేకంగా తయారుచేసే వంటకాలు కూడా చాలా ఫేమస్. ఒక్కసారి తిన్నారంటే జన్మలో వదలరు. అంత అద్భుతమైన రుచితో ఉంటాయి. సాధారణంగా మీరు ఇప్పటిదాకా ఎగ్ ఆమ్లెట్,చికెన్ ఆమ్లెట్ ని తిని ఉంటారు. అయితే శ్రీకాకుళం స్పెషల్ టమాటో ఆమ్లెట్ ఎప్పుడైనా తిన్నారా? శ్రీకాకుళంలో స్పెషల్ గా తయారుచేసే ఈ ఆమ్లెట్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి అయినా నైట్ డిన్నర్ కి అయినా ఈ టమాటో ఆమ్లెట్ బెస్ట్ ఆప్షన్. శ్రీకాకుళం స్పెషల్ టమాటో ఆమ్లెట్ ని మీరు కూడా మీ ఇంట్లో తయారుచేయాలనుకుంటున్నారా? అయితే దీనికి చేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూద్దాం.
టమాటో ఆమ్లెట్ తయారీకి కావలసిన పదార్థాలు
-బియ్యం
-టమాటో
-జీలకర్ర
-అల్లం
-కోడిగుడ్డు
-ఆయిల్
-సుజీ రవ్వ
-కారం
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-పసుపు
-కొత్తిమీర

టమాటో ఆమ్లెట్ తయారీ విధానం
-ముందుగా 1 కప్పున్నర బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంటన్నరసేపు నానబెట్టాలి.
-తర్వాత 4-5 టమాటోలను,రుచికి సరిపడా పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేపుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో.. గంటన్నరసేపు నానిన బియ్యం,టమాటో ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత అందులో 1కప్పు సుజీ రవ్వ,జీలకర్ర, కారం, ఉప్పు,పసుపు వేసి కలిపిన తర్వాత పిండి మిశ్రమంలో రెండు కోడిగుడ్లు కూడా కొట్టి వేసి ఈ మొత్తాన్ని బాగా కలపాలి.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడి చేసి దాని మీద కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక ఈ పిండితో దోశలాగా వేసుకోవాలి.
-దీని మీద కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు,కొంచెం కొత్తిమీర తరుగు వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే టమాటో ఆమ్లెట్ రెడీ.
-దీనిని మీకు నచ్చిన చట్నీ లేదా పచ్చడితో తింటుంటే ఆ మజా వర్ణించలేనిది. చట్నీ లేకున్నా కూడా వేడి వేడిగా తింటే కూడా అద్భుతంగా ఉంటుంది.
-ఈ పిండిని కోడిగుడ్డు వేసి స్టోర్ చేసుకోవడం కన్నా ఎగ్ వేసుకోకుండా ముందే పిండిని తీసి స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆమ్లెట్ తినాలనుకున్నప్నుడు ఎగ్ వేసుకొని ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications