Latest Updates
-
ఫోన్ పాస్వర్డ్లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్ -
పెళ్లై ఏళ్లు గడిచాక చాలా జంటలు భార్యాభర్తలుగా కాదు, రూమ్మేట్లలా జీవిస్తున్నారు మీరూ ఇలాంటివారేనా? -
మీ రాశి చక్రం ప్రకారం పడక గదిలో ఏ కలర్ పెయింటింగ్ వేస్తే మంచిదో తెలుసా.? -
రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు! -
ఈ ఫ్రూట్తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్ఫుల్.! -
లక్ష్మీదేవి సముద్రం నుండి ఎందుకు పుట్టింది? దాచిన పురాణ కథ -
జూన్ 6 గ్రహ సంచారం: కుంభరాశిలో చంద్రుడి ప్రయాణం.. ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ!
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా!
తెలుగు రాష్ట్రాలలో బిర్యానీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎప్పుడూ తినే చికెన్ బిర్యానీ వెరైటీలు బోర్ కొట్టేసిందా? అయితే ఈసారి పొట్లం చికెన్ బిర్యానీ ట్రై చేయండి. సాంప్రదాయ పద్ధతిలో అరిటాకులో బిర్యానీని పొట్లం కట్టి, ఆవిరి మీద దమ్ చేస్తే వచ్చే రుచి, సువాసన అద్భుతంగా ఉంటాయి. అరిటాకులో ఉండే సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఆవిరి ద్వారా బిర్యానీకి పట్టి రుచిని రెట్టింపు చేస్తాయి.

పొట్లం చికెన్ బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు
-చికెన్
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-గరం మసాలా పొడి
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయలు
-పెరుగు
-ఉప్పు
-కొత్తిమీర
-పుదీనా
-నూనె
-బాస్మతి బియ్యం
-నీళ్లు
-షాజీరా
-యాలకులు
-లవంగాలు
-మరాఠీ మొగ్గ
-దాల్చిన చెక్క
-బిర్యానీ ఆకులు
-అనాస పువ్వు
-నెయ్యి
-పెద్ద అరిటాకులు
-జీడిపప్పు
-కొబ్బరి పాలు

పొట్లం చికెన్ బిర్యానీ తయారీ విధానం
-ముందుగా బిర్యానీ రైస్ తయారుచేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో 5-6 చెంచాల నూనె వేసి వేడి చెయ్యాలి. వేడెక్కిన నూనెలో 5 యాలకలు, రెండున్నర అంగుళాల దాల్చిన చెక్క, 5 లవంగ మొగ్గలు, 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసి పొంగించండి. ఆ తర్వాత అందులో అరకప్పు ఉల్లిపాయ చీలికలు వేసి అవి మెత్తబడే వరకు వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే అందులో 3 పచ్చిమిరపకాయల చీలికలు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల తాజా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి.
-అల్లంవెల్లుల్లి ముద్ద వేగాక అందులో రెండు ముప్పావు కప్పు వేడి నీళ్లు పోసి ఎసరును తెర్ల కాగనివ్వాలి. ఇందులోనే ముప్పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మరిగించాలి. ఎసరు సముద్రపు నీరు అంత ఉప్పగా ఉండాలి.
-ఎసరు తెర్ల కాగుతున్నప్పుడు అందులో గంటసేపు నానబెట్టుకున్న ఒకటిన్నర కప్పుల బాస్మతి బియ్యం లేదా సోనామసూరి బియ్యం వేసి కలిపి మూతపెట్టేసి అన్నం వండుకున్నట్లు వండుకోవాలి. అన్నం ఉడికాక మూత తీయకుండా అలా వదిలేస్తే ఆ సెగకి అన్నం పొడిపొడిగా వస్తుంది.
-బిర్యానీ అన్నం చల్లారేలోగా చికెన్ గ్రేవీ తయారుచేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చెయ్యాలి. వేడెక్కిన నూనెలో 1 మరాఠీ మొగ్గ, 1బిర్యానీ ఆకు, రెండున్నర అంగుళాల దాల్చిన చెక్క, 5 యాలకలు, షాజీరా, అనాస పువ్వు, 5 లవంగాలు వేసి పొంగించాలి.
-తర్వాత పాన్ లో 1 కప్పు ఉల్లిపాయ చీలికలు వేసి మెత్తబడేంతవరకు వేపాలి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, పైపైన వేగితే చాలు.
-అల్లంవెల్లుల్లి వేగిన తర్వాత అందులో అర కిలో చికెన్(బిర్యానీ కట్)ముక్కలు వేసి,ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి చికెన్ ను పెద్ద మంట మీద ఉడికించాలి. దీంతో చికెన్ లోపల వరకు ఉడికి ముక్క మృదువుగా ఉంటుంది.
-చికెన్ లోని నీరు ఇగిరిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులో అరకప్పు చిలికిన కమ్మని పెరుగు వేసుకోండి. ఇందులో పావు కప్పు సన్నని పుదీనా తరుగు, పావు కప్పు కొత్తిమీర తరుగు, 3 పచ్చిమిర్చి చీలికలు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా లేదా గరం మసాలా వేసి బాగా కలుపుకోండి.
-చికెన్ ఉడికేలోగా మిక్సీ జార్ లో 20 జీడిపప్పులు వేసి,పావు కప్పు వేడి నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-రెడీ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ ని ఉడికిన చికెన్ లో వేసి కలుపుకోండి. ఈ చికెన్ ముక్కల్లోనే పావు కప్పు వేడి నీళ్లు పోసి జీడిపప్పు పేస్ట్ లో చికెన్ ను ఉడకనివ్వాలి.
-చికెన్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయండి. చికెన్ ముక్కల్లో ముప్పావు కప్పు చిక్కని కొబ్బరి పాలు పోసి కలిపి దించేయాలి. కొబ్బరి పాలు పోసిన తర్వాత ఉడికించకూడదు.
-ఇప్పుడు అరిటాకు తీసుకొని అందులో మధ్యలో రెడీ అయిన బిర్యానీ రైస్ పెట్టి సర్దుకోండి. బిర్యానీ రైస్ మీద రెడీ చేసుకున్న చికెన్ ఒక గరిటెడు వేసుకోండి. చికెన్ కర్రీ మీద మరో కప్పు బిర్యానీ రైస్ పెట్టుకోండి. పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అరిటాకును గట్టిగా మడతేసి పొట్లం కట్టేయాలి.
-మొత్తం బిర్యానీ, చికెన్ ను ఇలాగే అరిటాకుల్లో పొట్లాలుగా కట్టుకోవాలి. వీటిని గట్టిగా దారంతో కట్టి సీల్ చేయండి.
-తర్వాత స్టీమర్ లో లేదా ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి 10 నిమిషాలు ఈ పొట్లాలలను ఆవిరి మీద మూతపెట్టి ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి 10 నిమిషాలు స్టీమర్ లో వాటిని అలా వదిలేయండి. తర్వాత మూత తీసి ఒక్కో పొట్లం బయకు తీసి దారం తీయండి. అంతే సూపర్ టేస్టీ పొట్లం చికెన్ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications