Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
రెస్టారెంట్ స్టైల్ చికెన్ నూడిల్ సూప్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి
చలికాలం వచ్చిందంటే చాలు..చల్లటి గాలులతో పాటు జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు కూడా మన తలుపు తడతాయి. ఈ వాతావరణంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, శరీరం నిస్సత్తువగా అనిపించడం, నోటికి రుచి తెలియకపోవడం చాలా సహజం. ఇలాంటి సమయంలో ఘాటుగా, వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంటే బెస్ట్ ఆప్షన్ చికెన్ నూడిల్ సూప్.
ఇది కేవలం ఆకలిని తీర్చడమే కాదు, వణుకుతున్న శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఒక దివ్యౌషధం. ఇందులో ఉండే పోషకాలు, మసాలా దినుసులు గొంతు నొప్పికి, జలుబుకి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. రెస్టారెంట్ స్టైల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన చికెన్ నూడిల్ సూప్ ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-చికెన్
-నూడుల్స్
-ఉల్లిపాయ
-క్యారెట్
-క్యాబేజీ
-బీన్స్
-అల్లం
-వెల్లుల్లి
-మిరియాల పొడి
-ఉప్పు
-సోయా సాస్
-వెనిగర్
-నూనె లేదా వెన్న
-స్ప్రింగ్ ఆనియన్స్ (పచ్చి ఉల్లికాడలు)
తయారీ విధానం
-ముందుగా ఒక కుక్కర్ లేదా మందపాటి గిన్నెలో చికెన్, కొద్దిగా ఉప్పు, దంచిన అల్లం వేసి, ముక్కలు మునిగేలా పుష్కలంగా నీళ్లు పోయాలి. చికెన్ మెత్తగా ఉడికేవరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలను వేరు చేసి, చిన్న చిన్న ముక్కలుగా విడదీసి పక్కన పెట్టుకోవాలి.
-చికెన్ ఉడికించిన నీటిని వడకట్టి పక్కన ఉంచుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో వెన్న లేదా నూనె వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో క్యారెట్, క్యాబేజీ, బీన్స్ ముక్కలు వేసి అధిక మంటపై 2-3 నిమిషాలు వేయించాలి. కూరగాయలు మరీ మెత్తగా కాకుండా, కొంచెం కరకరలాడుతూ ఉంటేనే సూప్ లో తినేటప్పుడు రుచిగా ఉంటాయి
-వేయించిన కూరగాయలలో ముందుగా పక్కన ఉంచిన చికెన్ నీరు పోయాలి. నీరు మరుగుతుండగా, విడదీసిన చికెన్ ముక్కలు, నూడుల్స్ వేయాలి. నూడుల్స్ మెత్తబడే వరకు సన్నని మంటపై ఉడికించాలి.
-చివరగా రుచికి సరిపడా ఉప్పు, ఘాటు కోసం మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్ వేసి బాగా కలపాలి. మరో రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-మీకు సూప్ చిక్కగా కావాలంటే ఒక చిన్న గిన్నెలో చెంచా కార్న్‌ఫ్లోర్‌ను నీటిలో కలిపి, సూప్ దించే ముందు అందులో పోసి ఒక నిమిషం మరిగించండి.
-అంతే వేడి వేడి చికెన్ నూడిల్ సూప్ రెడీ. దీనిపై సన్నగా తరిగిన పచ్చి ఉల్లికాడలుచల్లుకుని, వేడిగా సర్వ్ చేసుకోండి. ఈ శీతాకాలంలో జలుబును తరిమికొట్టడానికి ఇంతకంటే మంచి ఔషధం మరొకటి లేదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications