Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఘుమఘుమలాడే పందెం కోడి కూర..ఇలా వండితే వెన్నలా కరిగిపోతుంది
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంటా కోడి మాంసం ఘుమఘుమలు వినిపిస్తాయి. అందులోనూ పందెం కోడి కూరకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సాధారణ బ్రాయిలర్ కోడి లేదా నాటు కోడి కంటే ఈ పందెం కోడి మాంసం రుచిలో చాలా భిన్నంగా ఉంటుంది.
పందెం కోళ్ళ పెంపకం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీటికి బాదం, పిస్తా, జీడిపప్పు, మటన్ కీమా, గుడ్లు వంటి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తారు. పందెం కోడి కూర ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పందెం కోడి మాంసం: 1 కిలో (చర్మంతో సహా చిన్న ముక్కలుగా
కొట్టించాలి)
ఉల్లిపాయలు: 4 పెద్దవి
పచ్చిమిర్చి: 6-8
అల్లం వెల్లుల్లి పేస్ట్: 3 టేబుల్ స్పూన్లు
కారం: 3-4 టేబుల్ స్పూన్లు
పసుపు: అర టీస్పూన్
ధనియాల పొడి: 2 టేబుల్ స్పూన్లు
గరం మసాలా: 1 టేబుల్ స్పూన్
నూనె: 1 కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: 1 కట్ట
పుదీనా: గుప్పెడు
కరివేపాకు: 2 రెమ్మలు
గసగసాలు: 1 టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరి ముక్కలు: చిన్న కప్పు
జీడిపప్పు: 6-8
చెక్క: 2 అంగుళాల ముక్క
లవంగాలు: 4-5
యాలకులు: 3
బిర్యానీ ఆకు: 2
తయారీ విధానం
-పందెం కోడి మాంసాన్ని పసుపు, ఉప్పు వేసి బాగా కడగాలి. మాంసం గట్టిగా ఉంటుంది కాబట్టి ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా మధ్యస్తంగా ఉండేలా చూసుకోవాలి.
-కడిగిన ముక్కల్లో ఒక స్పూన్ నూనె, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం కారం వేసి బాగా కలిపి కనీసం ఒక గంట పాటు పక్కన పెట్టాలి.
-స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఆ తర్వాత చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి.
-సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే గ్రేవీ అంత రుచిగా వస్తుంది. తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
-ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పందెం కోడి ముక్కలను కుక్కర్ లో వేయాలి. పెద్ద మంట మీద 5-10 నిమిషాల పాటు మాంసాన్ని నూనెలో బాగా వేయించాలి. ముక్కల్లోని నీరు బయటకు వచ్చి ఇగిరిపోయే వరకు వేయించాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, మిగిలిన కారం వేసి కలపాలి.
-ముక్కలు మునిగేలా నీరు పోసి, పుదీనా ఆకులు వేసి కుక్కర్ మూత పెట్టాలి.
-కుక్కర్ అయితే సుమారు 8 నుండి 10 విజిల్స్ రానివ్వాలి (ముదురు కోడి అయితే 12-15 విజిల్స్ కూడా అవసరం రావచ్చు). గిన్నెలో అయితే మూత పెట్టి సన్నని మంటపై సుమారు 1.5 నుండి 2 గంటల పాటు ఉడికించాలి..
-ముక్క ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి-గసగసాల పేస్ట్, ధనియాల పొడి వేసి కలపాలి.
-గ్రేవీ చిక్కబడే వరకు సన్నని మంటపై ఒక 10 నిమిషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా పొడి చల్లి, నూనె పైకి తేలే వరకు ఉంచి, కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications