Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
నోట్లో వెన్నలా కరిగిపోయే క్యారెట్ బర్ఫీ..తయారీ ఇంత ఈజీనా!
పండుగలు వచ్చినా, శుభకార్యాలు జరిగినా స్వీట్ లేనిదే ఆ వేడుక పూర్తి కాదు. లడ్డూలు, జిలేబీలు, పాయసం వంటి ఎన్నో రకాల స్వీట్స్ ఉన్నప్పటికీ కూరగాయలతో చేసే స్వీట్స్ లో క్యారెట్ తో చేసే వంటకాలకు ఎంతో ఆదరణ ఉంది.
సాధారణంగా అందరూ క్యారెట్ హల్వాను ఎక్కువగా ఇష్టపడతారు. కానీ క్యారెట్ హల్వా రుచిని పోలి ఉంటూ, ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయడానికి వీలుగా ఉండే క్యారెట్ బర్ఫీ మరింత ప్రత్యేకమైనది. క్యారెట్ బర్ఫీని ఎంతో రుచికరంగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా మీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
క్యారెట్ బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు
క్యారెట్ తురుము: 2 కప్పులు
పాలు: 1 కప్పు
పంచదార: 1 కప్పు
పాల కోవా లేదా మిల్క్ పౌడర్: అర కప్పు
నెయ్యి: పావు కప్పు (సుమారు 4-5 టేబుల్ స్పూన్లు)
యాలకుల పొడి: అర టీస్పూన్
డ్రై ఫ్రూట్స్: జీడిపప్పు, బాదం, పిస్తా- 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా క్యారెట్లను శుభ్రంగా కడిగి చెక్కు తీయాలి. తర్వాత సన్నగా తురుముకోవాలి. తురుము మరీ లావుగా ఉంటే బర్ఫీ సెట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది, మరీ మెత్తగా ఉంటే పేస్ట్ లా అవుతుంది. కాబట్టి మధ్యస్తంగా తురుముకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక, సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం ముక్కలను దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.
-అదే పాన్ లో మిగిలిన నెయ్యిలో సగం వేసి, క్యారెట్ తురుమును వేయండి. సన్నని మంటపై క్యారెట్ పచ్చి వాసన పోయేంతవరకు సుమారు 5-8 నిమిషాలు వేయించాలి.
-క్యారెట్ రంగు కొద్దిగా మారిన తర్వాత అందులో కాచి చల్లార్చిన పాలను పోయాలి. మంటను మీడియంలో ఉంచి, పాలన్నీ ఇగిరిపోయి, క్యారెట్ మెత్తగా ఉడికేంతవరకు కలపాలి. క్యారెట్ పూర్తిగా ఉడకడం చాలా ముఖ్యం.
-క్యారెట్ మిశ్రమం దగ్గర పడ్డాక, పంచదారను కలపాలి. పంచదార వేయగానే మిశ్రమం మళ్ళీ నీరుగా మారుతుంది. మధ్యమధ్యలో కలుపుతూ ఆ నీరంతా ఇగిరిపోయేలా ఉడికించాలి.
-మిశ్రమం కాస్త చిక్కబడ్డాక, అందులో స్వీట్ లేని కోవా లేదా మిల్క్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి.
-ఎప్పుడైతే మిశ్రమం పాన్ అంచుల నుండి విడిపోతూ ఒక ముద్దలాగా దగ్గరకు వస్తుందో, అప్పుడు అందులో యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. నెయ్యి బయటకు వస్తున్నట్లు కనిపిస్తే స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఒక ప్లేట్ లేదా ట్రేకి నెయ్యి రాసి సిద్ధంగా ఉంచుకోవాలి. తయారు చేసుకున్న క్యారెట్ మిశ్రమాన్ని ఆ ప్లేట్ లో వేసి, సమానంగా పరచాలి. పైన కావాలంటే ఇంకాస్త డ్రై ఫ్రూట్స్ చల్లుకోవచ్చు.
-మిశ్రమం పూర్తిగా చల్లారకముందే చాకుతో మీకు నచ్చిన ఆకారంలో గాట్లు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వత ముక్కలను వేరు చేయాలి. అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే క్యారెట్ బర్ఫీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







