Latest Updates
-
అమృతం రుచిని తలపించేలా వంకాయ పచ్చడి..ఇలా చేస్తే 2 నెలలు నిల్వ -
ఆడవారిలో రక్తం బాగా పెరగాలంటే..తరచూ వీటిని తినండి -
నోట్లో పెట్టుకుంటే జారిపోయే పచ్చికొబ్బరి హల్వా..చక్కెర లేకుండానే 10 నిమిషాల్లోనే చేసుకోండిలా.. -
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్..
చపాతీ, పూరీల్లోకి అదిరిపోయే శరవణ భవన్ స్టైల్ క్యాలీఫ్లవర్ కుర్మా..ఈజీగా చేసుకోండిలా..
శరవణ భవన్ అనగానే.. అక్కడ వడ్డించే స్వచ్ఛమైన శాకాహార వంటకాల రుచే వేరు. ముఖ్యంగా పూరీ, చపాతీల్లోకి వారు వడ్డించే క్యాలీఫ్లవర్ కుర్మా రుచి అద్భుతంగా ఉంటుంది. అందులో వాడే ప్రత్యేకమైన మసాలానే ఆ కూరకు అంతటి కమ్మదనాన్ని ఇస్తుంది. ఈ కుర్మా చపాతీ, పూరీలకే కాదు.. దోశ, పరోటాల్లోకి కూడా పర్ఫెక్ట్ మ్యాచ్. దీని రుచికి ఎవరైనా ఫిదా అయిపోతారు. శరవణ భవన్ స్టైల్ క్యాలీఫ్లవర్ కుర్మా మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
మసాలా పేస్ట్ కోసం:
గసగసాలు - 2 టేబుల్ స్పూన్లు
సోంపు - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు - 10 పలుకులు
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
టమాటా ప్యూరీ కోసం:
వెల్లుల్లి రెబ్బలు - 2
పచ్చిమిర్చి - 4
అల్లం ముక్క - 2 అంగుళాలు
పెద్ద ఉల్లిపాయ - 1
టమాటాలు - 3
ఇతర పదార్థాలు,పోపు కోసం:
క్యాలీఫ్లవర్ ముక్కలు - 3 కప్పులు
వెన్న (బట్టర్) - 2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - 1 అంగుళం
లవంగాలు - 3
యాలకులు - 2
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని.. అందులో గసగసాలు, సోంపు, జీడిపప్పు, కొబ్బరి తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి మెత్తగా ప్యూరీలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. అందులో రెండు చెంచాల వెన్న వేసి కరిగించండి. వెన్న కరిగాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించండి. కమ్మటి వాసన వస్తున్నప్పుడు.. ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లి-టమాటా పేస్ట్ వేసి కలపాలి. ఇందులోనే తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మూతపెట్టి నూనె పైకి తేలేంత వరకు మసాలాను బాగా ఉడికించాలి.
-మసాలా బాగా ఉడికిన తర్వాత, శుభ్రం చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి కలపాలి. కూరకు సరిపడా నీళ్లు పోసి, మూతపెట్టి క్యాలీఫ్లవర్ మెత్తబడేదాకా ఉడికించాలి.
అమృతం రుచిని తలపించేలా వంకాయ పచ్చడి..ఇలా చేస్తే 2 నెలలు నిల్వ
-కూర ఉడికిన తర్వాత.. మొదటగా తయారు చేసుకున్న జీడిపప్పు-కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలపండి. మరొక 5 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడకనివ్వాలి.
-కుర్మా చిక్కబడి, మంచి సువాసన వస్తున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే నోరూరించే ఘుమఘుమలాడే శరవణ భవన్ స్టైల్ క్యాలీఫ్లవర్ కుర్మా రెడీ. ఈ వేడివేడి కుర్మాను చపాతీ లేదా పూరీతో వడ్డించి చూడండి.. మీ ఇంట్లో వాళ్లంతా వహ్వా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
