maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా!

Posted By:

భారతీయ వంటకాల గురించి చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది మన సుగంధ ద్రవ్యాలే. మన మసాలాల గుమగుమలు వంటకాలకు ప్రాణం పోస్తాయి. అయితే పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ కట్టిపడేసే ఒక ప్రత్యేకమైన రుచి ఉంది.. అదే మ్యాగీ మసాలా.

ఇది కేవలం మ్యాగీకే పరిమితం కాదు. ఉదయం చేసే బంగాళదుంప వేపుడు అయినా, బెండకాయ ఫ్రై అయినా, క్యాబేజీ కూర, పాస్తా లేదా నూడుల్స్ అయినా.. అందులో చిటికెడు మ్యాగీ మసాలా పడితే ఆ రుచే వేరు. బయట దొరికే ఈ మ్యాజిక్ మసాలాను మన ఇంట్లోనే చాలా సులభంగా, స్వచ్ఛంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Stop Buying Packets Make Pure Chemical Free Maggi Masala in Your Kitchen Recipe in Telugu

మ్యాగీ మసాలా తయారీకి కావలసిన పదార్థాలు

ఉల్లిపాయ పొడి (ఆనియన్ పౌడర్) - 3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి పొడి (గార్లిక్ పౌడర్) - 3 టేబుల్ స్పూన్లు
కార్న్‌ఫ్లోర్ - 2.5 టేబుల్ స్పూన్లు
పొడి చక్కెర (షుగర్ పౌడర్) - 10 టేబుల్ స్పూన్లు
ఆమ్చూర్ పొడి - 2 టేబుల్ స్పూన్లు
సొంఠి పొడి - 1.5 టీస్పూన్లు
చిల్లీ ఫ్లేక్స్ - 3 టేబుల్ స్పూన్లు
పసుపు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
మిరియాలు - 3 టీస్పూన్లు
మెంతులు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 3-4
ధనియాలు - 2 టీస్పూన్లు
బిర్యానీ ఆకులు - 2
ఉప్పు - రుచికి సరిపడా

కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి!

మ్యాగీ మసాలా తయారీ విధానం

-ముందుగా జీలకర్ర, మెంతులు, బిర్యానీ ఆకులు, ధనియాలు, ఎండు మిర్చి, మిరియాలను ఒక పళ్లెంలో తీసుకుని ఒక రోజంతా ఎండలో ఉంచండి. ఎండబెట్టడం వల్ల వాటిలోని తేమ పోయి మంచి సువాసన వస్తుంది.

-ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో ఈ దినుసులన్నీ వేసి మీడియం మంట మంట మీద కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.

-వేయించిన మసాలా దినుసులను ఒక పళ్లెంలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత వాటిని మిక్సీ జార్‌ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడికి ఉల్లిపాయ పొడి, వెల్లుల్లి పొడి, కార్న్‌ఫ్లోర్, ఆమ్చూర్ పొడి, పొడి చక్కెర, సొంఠి పొడి, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు కలపండి. ఈ మిశ్రమాన్ని మరోసారి మిక్సీ పట్టుకోవాలి.

-మిక్సీ పట్టిన సుగంధ భరితమైన మసాలాను ఒక సన్నని జల్లెడతో జల్లించుకోండి.

-అంతే ఎంతో రుచికరమైన, కల్తీ లేని మీ సొంత హోమ్‌ మేడ్ మ్యాగీ మసాలా రెడీ.

-ఈ మసాలాను గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే, చాలా కాలం పాటు దాని తాజాదనం, ఘాటైన సువాసన చెక్కుచెదరకుండా ఉంటాయి.

[ of 5 - Users]
Story first published: Thursday, September 10, 2026, 16:27 [IST]
Desktop Bottom Promotion