Latest Updates
-
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది!
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ!
భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ లో చాట్ మసాలాకు ఉండే స్థానమే వేరు. పానీపూరి, దహీ వడ, భేల్ పూరి లేదా ఇంట్లో చేసుకునే ఫ్రూట్ సలాడ్స్.. ఇలా ఏది తిన్నా అందులో కాస్త చాట్ మసాలా పడితే ఆ రుచే మారిపోతుంది. పుల్లపుల్లగా, కారంకారంగా ఉంటూ నోటికి అద్భుతమైన రుచినిచ్చే ఈ మసాలాను సాధారణంగా చాలామంది మార్కెట్లో కొంటుంటారు.

అయితే మార్కెట్లో దొరికే ప్యాకెట్ మసాలాల్లో నిల్వ ఉంచే రసాయనాలు ఉంటాయి. కానీ ఎంతో స్వచ్ఛంగా, ఘాటైన సువాసనతో మన ఇంట్లోనే సులభంగా చాట్ మసాలాను తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.
చాట్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు
జీలకర్ర: అర కప్పు
మిరియాలు: 3 టేబుల్ స్పూన్లు
నల్ల ఉప్పు: 2 టేబుల్ స్పూన్లు
ఇంగువ: అర టీస్పూన్
జాజికాయ పొడి: 1/8 టీస్పూన్
సాధారణ ఉప్పు: 2 టేబుల్ స్పూన్లు
తాజా పుదీనా ఆకులు: 20
శొంఠి పొడి: అర టీస్పూన్
నిమ్మ ఉప్పు: ఒకటిన్నర టీస్పూన్
ఆమ్చూర్ పౌడర్: 2 టేబుల్ స్పూన్లు
కారం: 1 టీస్పూన్
`
చాట్ మసాలా తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. మంటను పూర్తిగా తక్కువలో ఉంచి, అందులో అరకప్పు జీలకర్ర వేయాలి. మాడిపోకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ, మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. జీలకర్ర ముదురు గోధుమ రంగులోకి రాకుండా జాగ్రత్తపడాలి.
-ఇప్పుడు అదే పాన్ లో మిరియాలు వేసి జీలకర్రతో పాటు మరో కొద్ది క్షణాల పాటు వేయించాలి. వేగిన ఈ దినుసులను ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు అదే పాన్ లో పుదీనా ఆకులను వేయాలి. మంటను సిమ్ లోనే ఉంచి, ఆకులు కరకరలాడేలా వేయించాలి. పుదీనా ఆకులు క్రిస్పీగా తయారయ్యాక స్టవ్ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి.
-జీలకర్ర, మిరియాలు, పుదీనా ఆకులు పూర్తిగా చల్లారిన తర్వాత, వాటిని ఒక పొడిగా ఉన్న మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఆమ్చూర్ పౌడర్, నల్ల ఉప్పు, సాధారణ ఉప్పు, కారం, శొంఠి పొడి, ఇంగువ, నిమ్మ ఉప్పు, చిటికెడు జాజికాయ పొడి వేయాలి. మిక్సీని ఒకేసారి వేగంగా తిప్పకుండా, ఆపుతూ ఆపుతూ (పల్స్ చేస్తూ) మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యమధ్యలో మూతతీసి స్పూన్‌తో కలుపుతూ ఉండటం వల్ల మసాలా అంతా సమానంగా, మెత్తగా నలుగుతుంది.
-గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక జల్లెడ పట్టి, పౌడర్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అందులో ఏవైనా నలగని ముక్కలు ఉంటే తొలగిపోతాయి. అంతే గుమగుమలాడే, నోరూరించే చాట్ మసాలా రెడీ.
నిల్వ చేసుకునే విధానం
తయారుచేసుకున్న చాట్ మసాలాను తడి లేని ఒక గాలి చొరబడని గాజు సీసాలో
నిల్వ చేసుకోవాలి. ఇలా భద్రపరుచుకుంటే, ఈ మసాలా కనీసం 6-8 నెలల పాటు
పాడవకుండా, సువాసన కోల్పోకుండా తాజాగా ఉంటుంది. దీన్ని మీ రోజువారీ
సలాడ్స్, మజ్జిగ, కూరలు లేదా స్నాక్స్ పై చల్లుకుని
ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
