For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ట్రాబెర్రీ పన్నా కాటా రెసిపీ తయారీ విధానం

పన్నా కాటా అనేది జెలటిన్ తో మరియు మధురమైన క్రీమ్ తో తయారుచేయబడిన ఇటాలియన్ డెజర్ట్. ఈ క్రీమ్ ని రమ్, కాఫీ, వనిల్లా, లేదా ఇతర ఫ్లేవర్స్ తో తయారుచేసుకోవచ్చు.

Posted By: Ashwini Pappireddy
|

పన్నా కాటా అనేది జెలటిన్ తో మరియు మధురమైన క్రీమ్ తో తయారుచేయబడిన ఇటాలియన్ డెజర్ట్. ఈ క్రీమ్ ని రమ్, కాఫీ, వనిల్లా, లేదా ఇతర ఫ్లేవర్స్ తో తయారుచేసుకోవచ్చు. మీరు మీకు ఇష్టమైనటువంటి వివిధరకాల ఫ్లేవర్స్ తో మరియు మరియు సాస్ లతో దీనిని నింపవచ్చు. ఈ రోజు మనం స్ట్రాబెర్రీ పన్నాకొట్టా ఎలా తయారుచేయాలో తెలుసుకుందామా. ఇందులో రుచులు అద్భుతంగా ఉంటాయి కానీ ఎరుపు మరియు తెలుపు కాంబో మీ హృదయాన్ని హమ్మా అనిపించేలా చేస్తుంది..... ఇంకా ఈ ఆదర్శవంతమైన డెజర్ట్ షేర్ చేసుకునే జంటలకు ఇంకా అద్భుతంగా ఉంటుంది.

స్ట్రాబెర్రీ పన్నా కాటా రెసిపీ | హోం స్ట్రాబెర్రీ పన్నా కాటా ని తయారుచేయడం ఎలా | ఇంటిలో తయారు చేసిన స్ట్రాబెర్రీ పన్నా కాటా రెసిపీ
స్ట్రాబెర్రీ పన్నా కాటా రెసిపీ | హోం స్ట్రాబెర్రీ పన్నా కాటా ని తయారుచేయడం ఎలా | ఇంటిలో తయారు చేసిన స్ట్రాబెర్రీ పన్నా కాటా రెసిపీ
Prep Time
35 Mins
Cook Time
25M
Total Time
1 Hours0 Mins

Recipe By: పూజ గుప్తా

Recipe Type: డెసర్ట్

Serves: 2-3

Ingredients
  • పానా కోటా కోసం కావలసిన పదార్థాలు:

    జెలాటైన్ ఆకులు - 3 టీస్పూన్స్

    డబుల్ క్రీం - ½ కిలో

    పాలు - 2 పెద్ద కప్పులు

    వైట్ కాస్టర్ షుగర్ - 1 పెద్ద కప్పు

    వనిల్లా పాడ్ - 1

    స్ట్రాబెర్రీలకు

    స్ట్రాబెర్రీ - ½ కిలో

    హల్డ్ మరియు సగం, లేదా క్వార్టర్ చాలా పెద్దది అయితే

    కార్న్ఫ్లోర్ - 1½ టీస్పూన్

    వైట్ క్యాస్టర్ చక్కెర - 1 కప్పు

How to Prepare
  • - పన్నా కాటా కోసం, జెలటిన్ ఒక చిన్న గిన్నెలో తీసుకొని సుమారు 5 నిముషాల పాటు నానబెట్టాలి.

    - ఈలోపు ఒక ఒక పాన్ తీసుకొని క్రీమ్, పాలు మరియు చక్కెర పోయాలి.

    - వనిల్లా పాడ్ ని ఒలిచి దానిలోని గింజలను తొలగించండి.

    - పైన పాన్ లో తీసుకున్న క్రీం తో వనిల్లా పాడ్ ని కలపండి.

    - వేడి అయేంతవరకు ఉంచండి, కానీ ఉడికించకూడదు.

    - ఇప్పడు ముందుగా నానబెట్టిన నీటి నుండి జెలటిన్ ఆకులను తొలగించండి.

    - ఆకులలో నీటిని పుర్తిగా తొలగించేదాకా పట్టుకొని,ఒకేసారి హాట్ క్రీం తో కలపండి.

    - పూర్తిగా కరిగిపోయే వరకు తిప్పుతూ, 20-30 నిముషాలు ఉంచండి.

    - చల్లబడిన తరువాత ద్రవంలో నుండి వెనిలా ప్యాడ్లు తొలగించండి.

    - ఈ మొత్తం మిశ్రమాన్ని మిశ్రమాన్ని 6 మాములు గ్లాసుల్లోకి వంచుకొని,దీనిని కనీసం 3 గంటల పాటు చల్లార్చాలి.

    - ఒక సాస్ పాన్ తీసుకొని మొక్కజొన్న పిండి మరియు చక్కెర, స్ట్రాబెర్రీ తో కలపండి

    - మీడియం మంటలో ఉంచుకొని 4-5 నిముషాల పాటు ఉడికించండి. స్ట్రాబెర్రీస్ సాఫ్టుగా అయేంతవరకు మరియు వాటినుండి చిక్కటి రసం వచ్చేదాకా ఉడికించాలి.

    - ఇప్పడు దీనిని దించేసి పక్కన పెట్టి కాస్సేపు చల్లారనివ్వండి.

    - పూర్తిగా చల్లబడిన తరువాత, స్ట్రాబెర్రీ మిశ్రమంతో కూడిన సెట్ పన్నా ని పైన నింపండి. సర్వ్ చేసేంతవరకు ఓపికగా వెయిట్ చేయండి.

Instructions
  • 1. మీరు మొక్కజొన్న పిండితో మిశ్రమాన్ని తయారు చేయటానికి బదులుగా కావాలనుకుంటే స్ట్రాబెర్రీ జెల్లీని ఉపయోగించవచ్చు
  • 2. స్ట్రాబెర్రీ మిశ్రమాన్ని కలిపే ముందు పన్నా కాట్టా క్రీమ్ మిశ్రమం పూర్తిగా చల్లబడే దాక వెయిట్ చేయాలి
  • 3. ఒకవేళ అలా కాకపోతే , అది డెజర్ట్ యొక్క ఆకృతి ని నాశనం చేసి, కరిగిపోతుంది.
Nutritional Information
  • సెర్వింగ్ సైజు - 1 మీడియం డిజర్ట్ గాజు
  • కేలరీలు - 477 -cal
  • కొవ్వు - 37 గ్రా
  • ప్రోటీన్ - 3 గ్రా
  • కార్బోహైడ్రేట్లు - 32 గ్రా
  • షుగర్ - 31 గ్రా
  • డైటరీ ఫైబర్ - 1 గ్రా
[ 3.5 of 5 - 51 Users]
English summary

Strawberry Panna Cotta Recipe | How To Prepare Strawberry Panna Cotta At Home | Homemade Strawberry Panna Cotta Recipe

Strawberry panna cotta is an Italian dessert that is prepared with a creamy panna cotta base and a fresh strawberry sauce on top. Panna cotta is prepared with sweetened cream thickened with gelatin and moulded.Here is a simple recipe on how to prepare strawberry panna cotta at home with a detailed step-by-step procedure..
Story first published: Friday, December 22, 2017, 11:03 [IST]
Desktop Bottom Promotion