Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
ఆహా ఏమి రుచి..వేడి వేడి చికెన్ లెగ్ సూప్..టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చికెన్ కర్రీ, ఫ్రై, బిర్యానీ వంటి ఎన్నో రకాల వంటకాలను మనం తరచూ ఆస్వాదిస్తుంటాం. అయితే రుచితో పాటు అపారమైన ఆరోగ్యాన్ని ఇచ్చే వంటకం ఏదైనా ఉందంటే అది చికెన్ సూప్ మాత్రమే.
సాధారణ చికెన్ సూప్ కంటే చికెన్ లెగ్ సూప్ ఆరోగ్యానికి సంజీవని లాంటిది. ఇందులో ఉండే పోషకాలు, మసాలాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కోడి కాళ్ళను ఉడికించడం వల్ల అందులో నుండి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన మినరల్స్ సూప్ లోకి విడుదలవుతాయి. ఇవి మన ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు ఇది చక్కటి ఔషధం. చికెన్ లో ఉండే విటమిన్ B6 గుండె ఆరోగ్యానికి మంచిది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
కావలసిన పదార్థాలు
కోడి కాళ్ళు: 4-5 (చర్మం లేనివి, శుభ్రంగా కడిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
టమాటో: 1
పచ్చిమిర్చి: 2
మిరియాల పొడి: అర టీస్పూన్
జీలకర్ర పొడి: అర టీస్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర, పుదీనా: గుప్పెడు
నీళ్లు: తగినన్ని
తయారీ విధానం
-ముందుగా కోడి కాళ్ళను పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి. సూప్ కోసం ఎప్పుడూ చర్మం లేని కాళ్ళను వాడటం మంచిది.
-ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో శుభ్రం చేసిన కోడి కాళ్ళను వేయండి.
-ఇప్పుడు కుక్కర్ లోనే తరిగిన టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ముక్కలు మునిగేలా తగినన్ని నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై ఉంచాలి.
-కోడి కాళ్ళు గట్టిగా ఉంటాయి కాబట్టి సారం మొత్తం నీటిలోకి దిగడానికి కనీసం 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి.
-ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూడండి. సూప్ మరుగుతుండగా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులను వేసి మరో 3-4 నిమిషాలు సన్నని మంటపై మరిగించండి.
-అంతే ఘాటైన, రుచికరమైన చికెన్ లెగ్ సూప్ రెడీ. దీనిని బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేయండి.
-జలుబు చేసినప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు ఈ సూప్ తాగితే గొంతుకు, కడుపుకు ఎంతో హాయిగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









