Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
మనదేశపు సూపర్ ఫుడ్ తో ఇలా లంచ్ చేస్తే..గుడ్డు,పాలు,చికెన్ కన్నా ఎన్నో రెట్లు ఆరోగ్య ప్రయోజనాలు
చాలామంది అమ్మలు పిల్లలు సరిగా పాలు తాగట్లేదని బాధపడుతుంటారు. అయితే పాలు తాగడం ఇష్టం లేని పిల్లలకు పాలు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కాల్షియం ఉండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలా మునగాకు రైస్ ట్రై చేయండి. మునగాకును సంపూర్ణ ఆయుర్వేద ఔషధంగా పరిగణిస్తారు. పోషకాల గని అయిన మునగాకుతో తయారుచేసే ఈ రైస్.. పిల్లల లంచ్ బాక్స్ లకు లేదా పెద్దలకు మధ్యాహ్న భోజనానికి చాలా ఆరోగ్యకరమైన, రుచికరమైన ఎంపిక.
దీని తయారీ చాలా సులువు, తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఈ వంటకం..పాలు,చికెన్,గుడ్ల తినే దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ బలం వస్తుంది. ఎదిగే పిల్లలకే కాకుండా బరువు తగ్గాలనుకున్నోళ్లకు, షుగర్ పేషెంట్లకు కూడా ఎంతో మేలు చేసే మునగాకుతో చేసే రైస్ ను మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-మునగకాకు
-ఉప్పు
-ఉల్లిపాయలు
-కారం
పచ్చిమిరపకాయలు
కరివేపాకు
పసుపు
ఎండబెట్టిన చింత చిగురు(లేదా గోంగూర)
ఉడకించిన అన్నం

తయారీ విధానం
2 కప్పుల మునగాకు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి.
తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి ఇందులో సన్నగా కట్ చేసిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయల ముక్కలు, సన్నగా కట్ చేసిన 6 పచ్చిమిరపకాయల ముక్కలు,ఒక రెమ్మ కరివేపాకు, 2 స్పూన్ల ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మీడియం మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ వేయించుకోవాలి.
ఉల్లిపాయలు 80శాతం వరకు వేగాక అందులో పావు స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని కలిపాక కడిగి పెట్టుకున్న మునగాకుని సన్నగా తరిగి వేసుకోండి. తక్కువ మంట మీద నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి.
మునగాకులోని పచ్చిదనం పోయాక ఇందులో గుప్పెడు ఎండబెట్టిన చింత చిగురు వేసుకోండి. ఇది లేకుంటే ఈ స్టేజ్ లో సన్నగా తరిగిన గోంగూర అయినా వేసుకోవచ్చు. మూతపెట్టి తక్కువ మంట మీద 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి.
ఇప్పుడు స్టవ్ ఆపేసి పాన్ లో ఉడికించిన అన్నం వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. రుచి చెక్ చేసుకొని కావాలనుకుంటే ఇప్పుడే ఉప్పు వేసి కలుపుకోవచ్చు. అంతే మునగాకు రైస్ రెడీ.
కొన్ని ప్రయోజనాలు
-మునగాకులో క్యారెట్ ల కంటే 4 రెట్లు ఎక్కువ విటమిన్ A ఉంటుంది, ఇది కంటి చూపుకు చాలా మంచిది.
-నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ C ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
-పాలు కంటే 4 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది..ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి అవసరం.
-అరటిపండ్ల కంటే 3 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది.. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
-పాలకూర కంటే 25 రెట్లు ఎక్కువ ఐరన్ ఉంటుంది, ఇది రక్తహీనతను నివారించడంలో కీలకం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications