Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
పంచదార లేకుండానే అమృతం లాంటి సొరకాయ పాయసం..గిన్నెలు గిన్నెలు లేపేయడం గ్యారెంటీ!
మండుతున్న వేసవి ఎండలు అల్లాడిస్తున్నాయా? ఎండ వేడికి గొంతు ఆరిపోతుంటే, కడుపులో చల్లగా, నోటికి తియ్యగా ఏదైనా తినాలనిపించడం సహజం. అయితే, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఒక అద్భుతమైన వేసవి వంటకం సొరకాయ పాయసం. సొరకాయ అనగానే కేవలం కూర లేదా పులుసు మాత్రమే గుర్తుకొస్తుందా? అయితే మీరు ఈ తీపి వంటకాన్ని కచ్చితంగా రుచి చూడాల్సిందే.

వేసవిలో సొరకాయ మన శరీరానికి ఒక వరం లాంటిది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. కడుపులో చల్లదనాన్ని ఇచ్చి జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఇక దీన్ని పంచదారకు బదులుగా బెల్లం లేదా ఖర్జూరంతో చేస్తే ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
సొరకాయ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత సొరకాయ - 1
చిక్కటి ఫుల్ క్రీమ్ పాలు - 1 లీటరు
ఆర్గానిక్ బెల్లం పొడి లేదా ఖర్జూర గుజ్జు - అర కప్పు
స్వచ్ఛమైన నెయ్యి - 1 టీస్పూన్
తరిగిన డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండుద్రాక్ష)-
తగినన్ని
యాలకుల పొడి - అర టీస్పూన్

సొరకాయ పాయసం తయారీ విధానం
-ముందుగా లేత సొరకాయను తీసుకుని, తొక్క తీసి సన్నగా తురుముకోవాలి. సొరకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తురుమును చేత్తో గట్టిగా పిండి అదనపు నీటిని తీసేయండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక బాండీ పెట్టి అందులో కమ్మటి నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక సొరకాయ తురుము వేసి, పచ్చివాసన పోయి సువాసన వచ్చే వరకు సుమారు 5 నుండి 7 నిమిషాల పాటు మీడియం మంటపై వేయించండి.
-మరోవైపు అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఫుల్ క్రీమ్ పాలను పోసి బాగా మరిగించండి. పాలు కాస్త చిక్కబడుతున్న సమయంలో నెయ్యిలో వేయించి పెట్టుకున్న సొరకాయ తురుమును అందులో కలపండి. సన్నని మంట మీదే ఈ మిశ్రమాన్ని ఉడకనివ్వాలి. పాలు సగానికి కుచించుకుపోయి, సొరకాయ మెత్తబడి పాలతో పూర్తిగా కలిసేవరకు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఈ దశలో యాలకుల పొడి,డ్రై ఫ్రూట్స్ కలుపుకోండి. కిస్మిస్, ఖర్జూరం వంటి నట్స్ లో ఉండే సహజమైన తీపి ఖీర్‌కు అదనపు రుచిని ఇస్తుంది.
-ఇప్పుడు స్టవ్ ఆపేయండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ మరుగుతున్న పాలలో బెల్లం వేయకూడదు, అలా చేస్తే పాలు విరిగిపోతాయి. కాబట్టి పాయసం కొద్దిగా చల్లారాక అందులో బెల్లం పొడి లేదా ముందుగా సిద్ధం చేసుకున్న ఖర్జూర గుజ్జు వేసి బాగా కలపండి.
-అంతే ఎంతో కమ్మని, ఆరోగ్యకరమైన షుగర్ ఫ్రీ సొరకాయ పాయసం రెడీ. దీన్ని ఫ్రిజ్ లో పెట్టి, బాగా చల్లారిన తర్వాత సర్వ్ చేయండి. ఎండలో బయట నుంచి వచ్చిన వారికి ఈ చల్లని, తియ్యని ఖీర్ ఇస్తే అమృతం తాగినంత ఆనందపడిపోతారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications