Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పది నిమిషాల్లో రెడీ అయ్యే కూల్ కూల్ డెజర్ట్.. కమ్మటి మ్యాంగో మలై రోల్స్ ఎలా చేసుకోవాలంటే..
ఎండకాలంలో లభించే తీయ్యటి మామిడికాయలతో మనం ఎన్నో రకాల రుచికరమైన వంటకాలు చేస్తుంటాం. మీరు ఇప్పటికే మ్యాంగో లస్సీ, మ్యాంగో మిల్క్ షేక్, లేదా మ్యాంగో ఐస్ క్రీమ్ లాంటివి ఎన్నోసార్లు రుచి చూసే ఉంటారు. కానీ మీరెప్పుడైనా మామిడి మలై రోల్స్ గురించి విన్నారా? లేదా ఎప్పుడైనా రుచి చూశారా? లేదంటే మాత్రం.. ఈ వేసవిలో మీరు ఒక అద్భుతమైన రుచిని మిస్ అవుతున్నట్లే.

ఇది కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదు.. ఒక సరికొత్త అనుభూతి. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ, చల్లచల్లగా గొంతులోకి జారిపోయే ఈ అద్భుతమైన డెజర్ట్ వేసవి తాపాన్ని క్షణాల్లో మాయం చేస్తుంది. దీనికి పెద్దగా ఖరీదైన పదార్థాలు కూడా అవసరం లేదు. ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతో అతి తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు.
మ్యాంగో మలై రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పండిన తీయ్యటి మామిడి ముక్కలు - అర కప్పు
తాజా పనీర్ - 100 గ్రాములు
పాలపొడి (మిల్క్ పౌడర్) - పావు కప్పు
చిక్కటి పాలు - పావు కప్పు
పంచదార - పావు కప్పు
పసుపు రంగు (ఫుడ్ కలర్) - రెండు మూడు చుక్కలు
యాలకుల పొడి - అర టీస్పూన్
బ్రెడ్ స్లైస్‌లు - 7
బాగా చల్లని పాలు - 1 కప్పు
పండిన మామిడి ముక్కలు - అర కప్పు
పంచదార - 1 టీస్పూన్
పసుపు ఫుడ్ కలర్ - రెండు మూడు చుక్కలు
సన్నగా తరిగిన పిస్తా పప్పులు - 1 టీస్పూన్
మ్యాంగో మలై రోల్స్ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పండిన మామిడి ముక్కలు, తురిమిన పనీర్, పాలపొడి, చిక్కటి పాలు, పంచదార వేసి అన్నింటినీ బాగా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ లేదా బాండీని పొయ్యి మీద పెట్టి.. అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మిశ్రమాన్ని వేసి మీడియం మీద నెమ్మదిగా ఉడికించాలి. ఈ సమయంలోనే పాన్ లో యొల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసి కలపండి. మిశ్రమం అడుగు అంటకుండా, మిశ్రమం పూర్తిగా దగ్గరపడి, మందంగా (చిక్కగా) మారే వరకు కలుపుతూ ఉండాలి.
-మిశ్రమం పాన్ అంచుల నుంచి విడిపోతున్న సమయంలో అందులో అర టీస్పూన్ యాలకల పొడి వేసి కలుపుకొన్నాక స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
-ఇప్పుడు బ్రెడ్ స్లైస్ లను తీసుకుని, వాటి చుట్టూ ఉండే అంచులను (బ్రౌన్ కలర్ పార్ట్) చాకుతో జాగ్రత్తగా కత్తిరించాలి. తర్వాత ఆ బ్రెడ్ ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకుని చపాతీ కర్రతో నెమ్మదిగా రుద్దుతూ పల్చగా చేసుకోవాలి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మామిడి-పనీర్ మిశ్రమాన్ని అర టీస్పూన్ చొప్పున తీసుకుని బ్రెడ్ స్లైస్ ఒక అంచున పెట్టి, నెమ్మదిగా రోల్ లాగా చుట్టుకోవాలి. ఇలాగే మిగిలిన బ్రెడ్ ముక్కలన్నింటినీ రోల్స్‌లా చుట్టుకుని, ఒక అందమైన ట్రే లేదా బాక్స్ లో ఒకదాని పక్కన ఒకటి వరుస క్రమంలో పేర్చుకోవాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ప్యూరీ కోసం తీసుకున్న అర కప్పు మామిడి ముక్కలు, చల్లని పాలు, కొద్దిగా పంచదార, పసుపు ఫుడ్ కలర్ వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఇది చాలా క్రీమీగా తయారవుతుంది.
-ట్రేలో అందంగా పేర్చి పెట్టుకున్న ఆ బ్రెడ్ రోల్స్ పైన.. తయారు చేసిన మామిడి ప్యూరీని పోయాలి. ఆ రోల్స్ ఆ క్రీమీ ప్యూరీని పూర్తిగా పీల్చుకునేలా సమానంగా స్ప్రెడ్ చేయాలి. పైన సన్నగా తరిగిన పిస్తా ముక్కలను చల్లి అలంకరించండి. దీనిని తయారుచేసిన వెంటనే తిన్నా బాగుంటుంది, లేదా ఫ్రిజ్ లో పెట్టి ఓ గంట తర్వాత పూర్తిగా చల్లబడ్డాక తింటే ఆ అనుభూతి వర్ణనాతీతం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications