Latest Updates
-
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.!
సమ్మర్‌లో చల్లచల్లగా మిల్క్‌షేక్, మాక్‌టెయిల్.. ఈ ఫ్రూట్స్‌తో స్పెషల్ డ్రింక్స్
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా
టాప్-50 హీట్ నగరాలు మొత్తం భారత్‌లోనే
ఉన్నాయంటే ఇక్కడ వేడి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా
45డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేడికి
కూల్ వాటర్ ఎన్ని తాగినా దాహం చల్లారదు. అందుకే
బడ్జెట్ ధరల్లో మన సీజనల్ ఫ్రూట్స్‌తో ఈ
మిల్క్ షేక్, మాక్‌టెయిల్స్
తాగారంటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. ఆ చల్లటి పానీయాలు ఏంటి..
వాటిని ఎలా తయారు చేయాలి? ఇక్కడ చూద్దాం..

షుగర్ కేన్ మిల్క్ షేక్
సమ్మర్‌లో తెలుగు రాష్ట్రాల్లో మన బడ్జెట్‌లో దొరికే తియ్యనైన ఫ్రూట్ ఇదే. సాధారణంగా బయట షుగర్‌కేన్ జ్యూస్‌లు తాగుతుంటారు. లేదంటే డైరెక్ట్‌గా వాటిని తింటాం. కానీ ఈసారి ఇలా మిల్క్‌షేక్ తాగి చూడండి.. అటు కాల్షియంతో పాటు ఇటు ఎనర్జీ మీ సొంతం..
షుగర్ కేన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
చెరుకు కాండం- తొక్క తీసినవి 8 నుంచి 10 చిన్న ముక్కలు
ఐస్ ముక్కలు
పాలు- అరలీటరు
జీడిపప్పు- 10 నుంచి 15 పలుకులు
ఐస్ ముక్కలు- 5
తయారీ విధానం
ముందుగా చెరుకు ముక్కలను జ్యూస్ మిక్సర్ జార్‌లో వేసుకుని పావు లీటర్ పాలు కలుపుకోవాలి. ఆ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని పల్చటి శుభ్రమైన క్లాత్ ద్వారా జ్యూస్‌ను వడగొట్టాలి. ఇప్పుడు జ్యూస్ మిక్సర్‌లో జీడిపప్పు పలుకులు, మిగిలిన పాలు పోసి గ్రైండ్ చేయాలి. ఈ రెండు మిశ్రమాలను మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అనంతరం ఓ గ్లాస్‌లో ఐస్ ముక్కలు వేసి ఈ జ్యూస్‌ను కలుపుకుంటే చల్లచల్లని షుగర్‌కేన్ మిల్క్‌షేక్ రెడీ.. హెల్తీగా కోరుకునే వారికి లో బడ్జెట్‌లోనే ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తాగాల్సిందే..
ఆరెంజ్ మాక్‌టెయిల్
ఆరెంజ్ ఫ్రూట్‌లో ఉండే విటమిన్ సి.. ఏ సీజన్‌లో అయినా మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ వేసవిలో కొంచెం భిన్నంగా ఆరెంజ్ చల్లచల్లని మాక్‌టెయిల్‌ను ఆస్వాదించండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
ఆరెంజ్- 3
వెనీలా ఐస్‌క్రీమ్- ఒక కప్పు
చాక్లెట్ క్రీమ్- కొద్దిగా
ఐస్ ముక్కలు- 5
తయారీ విధానం
ముందుగా ఆరెంజ్ తొక్కతీసి పండును ఒక గిన్నెలో వేసి మాషర్‌తో మెత్తగా చేసుకోవాలి. తర్వాత పల్చటి క్లాత్ తీసుకుని పిప్పిని మొత్తం వేరు చేయాలి. ఇప్పుడు ఈ జ్యూస్‌లో ఐస్‌క్రీమ్, చాక్లెట్ క్రీమ్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఐస్‌ముక్కలు వేసుకోవాలి. అవసరమైతే చివర్లో మిల్క్ షేక్ కలుపుకోవచ్చు. అంతే 5 నిమిషాల్లో ఆరెంజ్ మాక్‌టెయిల్ రెడీ.. ఇన్‌స్టంట్ చల్లదనం కోసం ఖరీదైన ప్రిజర్వేటివ్ పానీయాల జోలికి వెళ్లకుండా హెల్తీగా ఈ జ్యూస్‌లు తయారుచేసుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications