Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఎండాకాలంలో కడుపు చల్లగా..పంజాబీ స్టైల్ లో లస్సీ ఇలా చేసుకోండి
ఎండాకాలం వచ్చేసింది. అప్పుడే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అయితే సమ్మర్ లో మండే వేడి నుంచి తప్పించుకోడానికి చాలామంది కూల్ డ్రింక్ లు తాగుతుంటారు. అయితే ఏది పడితే అది తాగి ఆరోగ్యం చెడగొట్టుకోవడం కన్నా ఆరోగ్యకమైన డ్రింక్ లు తీసుకోడం బెస్ట్.
సమ్మర్ లో చాలామంది తీసుకునే డ్రింక్ లలో లస్సీ కూడా ఉంటుంది. దీని వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే పంజాబ్ లో ఈ లస్సీ చాలా ప్రత్యేకంగా చేస్తుంటారు. మీరు కూడా మీ ఇంట్లో పంజాబీ స్టైల్ లస్సీ తయారుచేసుకోవాలనుంటే ఎలాగో ఇక్కడ చూడండి.

పంజాబీ స్టైల్ లస్సీ తయారీకి కావీల్సిన
పదార్థాలు
-పెరుగు
-చక్కెర
-పిస్తా తరుగు
-పాలకోవా
-కుంకుమ పువ్వు
-యాలకల పొడి
-ఐస్ వాటర్
పంజాబీ స్టైల్ లస్సీ తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ తీసుకొని అందలో చిక్కటి మీగడతో ఉన్న 400 గ్రాముల పెరుగు వేయండి.
-దీనిని 4 నిమిషాల పాటు బాగా చిలుక్కోవాలి(బ్లైండ్ చేసుకోవాలి)
-తర్వాత ఇందులో ఐదారు చెంచాలా చక్కెర, అర చెంచా యాలకల పొడి వేసి మళ్లీ 2 నిమిషాలు చిలుక్కోవాలి(బ్లైండ్ చేయాలి).
-తర్వాత ఇందులో బాగా చల్లగా ఉండే అరకప్పు ఐస్ వాటర్ పోసి మళ్లీ రెండు నిమిషాలు బ్లైండ్ చేసుకోండి. అప్పుడు వెన్న మొత్తం పైకి తేలుతుంది.
-ఇప్పుడు ఈ లస్సీని తాగే గ్లాసులో పోసుకొని ఇందులో కొంచెం పిస్తా తరుగు, ప్రెష్ బటర్, కొంచెం పాలకోవా,కొంచెం కుంకుమ పువ్వు వేయండి. అంతే పంజాబీ స్టైల్ లస్సీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications