Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
వేసవికాలం వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లోనూ పచ్చి మామిడికాయల సందడి మొదలవుతుంది. సాధారణంగా మనం పుల్లటి మామిడికాయ పచ్చళ్లు లేదా మామిడికాయ తురుముతో కూరలు చేసుకుంటాం. కానీ, తీపి, పులుపు సమపాళ్లలో కలగలిసిన అద్భుతమైన రుచిని ఆస్వాదించాలనుకుంటే మాత్రం మామిడికాయ బెల్లం పచ్చడి బెస్ట్ ఆప్షన్. వేడి వేడి అన్నం, చపాతీ, పూరీ లేదా పరాటాలలోకి ఇది అద్భుతమైన కాంబినేషన్. ముఖ్యంగా పిల్లలు దీని తీపి-పులుపు రుచిని ఎంతో ఇష్టపడతారు.

మామిడికాయ బెల్లం పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
పచ్చి మామిడికాయలు - 1 కిలో
బెల్లం తరుగు - 1 కిలో
జీలకర్ర - 1 టీస్పూన్
నల్ల జీలకర్ర (కలోంజి) - 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 4
బిర్యానీ ఆకులు - 2
వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్
కారం పొడి - అర టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
వంట నూనె - 2 టేబుల్ స్పూన్లు
మామిడికాయ బెల్లం పచ్చడి తయారీ విధానం
-ముందుగా తీసుకున్న ఒక కిలో పుల్లని పచ్చి మామిడికాయలను నీటిలో శుభ్రంగా కడగాలి. తడి లేకుండా పొడి గుడ్డతో తుడిచిన తర్వాత, వాటిని రెండుగా కోసి, లోపలి జీడిని తీసేయాలి. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి కడాయి లేదా పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె కొద్దిగా వేడెక్కాక జీలకర్ర, నల్ల జీలకర్ర, ఎండు మిరపకాయలు, బిర్యానీ ఆకులు వేసి మంచి సువాసన వచ్చేలా దోరగా వేయించాలి.ః
-పోపు దినుసులు చిటపటలాడుతున్నప్పుడు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అందులో వేయాలి. నూనె, పోపు అంతా ముక్కలకు పట్టేలా గరిటతో బాగా కలపాలి.
-రెండు నిమిషాల తర్వాత మామిడి ముక్కలు కొద్దిగా మెత్తబడటం ప్రారంభమవుతాయి. అప్పుడు అందులో ఉప్పు, కారం పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసి కలపాలి. ఆ వెంటనే కిలో బెల్లం తరుగును కూడా అందులో వేసి, స్టవ్ మంటను పూర్తిగా తగ్గించి మూత పెట్టాలి. దాదాపు పది నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. అప్పటికి బెల్లం పూర్తిగా కరిగిపోయి, పాకంలా మారి మామిడి ముక్కలకు అద్భుతంగా పడుతుంది.
-మూత తీసి మిశ్రమాన్ని మరోసారి బాగా కలపాలి. పాకం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మామిడికాయ బెల్లం పచ్చడి రెడీ.
-పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత, గాలి చొరబడని డబ్బాలో లేదా గాజు సీసాలో భద్రపరచుకోవాలి. దీనిని ఫ్రిజ్ లో పెట్టకపోయినా బయట కూడా చాలా నెలల పాటు పాడవకుండా ఉంటుంది. అయితే పచ్చడికి ఎట్టిపరిస్థితుల్లోనూ తడి తగలకుండా చూసుకోవాలి. వాడేటప్పుడు పొడి చెంచాను మాత్రమే ఉపయోగించాలి. ఫ్రిజ్‌లో పెడితే మరింత ఎక్కువ కాలం పాటు రంగు, రుచి మారకుండా తాజాగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications